చాంపియన్స్‌ సౌజన్య, నిక్కీ

6 Oct, 2019 10:17 IST|Sakshi

∙అండర్‌–18 బాలికల చాంప్‌ రష్మిక

∙ఫెనెస్టా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. న్యూ   ఢిల్లీలో జరిగిన ఈ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాలతో పాటు అండర్‌–18 బాలికల కేటగిరీలోనూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నిక్కీ పునాచ, సౌజన్య భవిశెట్టి పురుషుల, మహిళల సింగిల్స్‌ టైటిల్స్‌ను హస్తగతం చేసుకోగా... అండర్‌–18 బాలికల సింగిల్స్‌లో తెలంగాణకు చెందిన రషి్మక భమిడిపాటి చాంపియన్‌గా అవతరించింది. శనివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ నిక్కీ పునాచ 6–2, 7–6 (7/4)తో ఆర్యన్‌ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు.

మరోవైపు శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌లో రిషికతో కలిసి డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన సౌజన్య... సింగిల్స్‌ విభాగంలోనూ సత్తాచాటింది. టాప్‌ సీడ్‌గా బరిలో దిగిన ఆమె ఫైనల్లో 6–4, 6–2తో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై గెలు పొందింది. సౌజన్యకిదే తొలి జాతీయ టైటిల్‌ కావడం విశేషం. అండర్‌–18 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ రష్మి క భమిడిపాటి 6–0, 6–4తో ఐదో సీడ్‌ సందీప్తి సింగ్‌ రావుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలుర తుదిపోరులో మాడ్విన్‌ కామత్‌ 6–2, 7–6 (7/1)తో ఉదిత్‌ గొగోయ్‌పై గెలుపొంది చాంపియన్‌గా నిలిచాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేసింది.  

>
మరిన్ని వార్తలు