రన్నరప్‌ సౌజన్య జోడీ

5 Aug, 2019 10:09 IST|Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణులు సౌజన్య భవిశెట్టి, శ్రావ్యశివాని చిలకలపూడి రాణించారు. ట్యునీషియాలోని టబర్కా వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జంటగా మహిళల డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. ఫైనల్లో నాలుగో సీడ్‌ సౌజన్య–శ్రావ్య శివాని జంట 2–6, 2–6తో మూడో సీడ్‌ ఎవా వెడెర్‌–స్టీఫెన్‌ జుడిత్‌ విసెర్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో సౌజన్య–శ్రావ్య శివాని ద్వయం 7–5, 3–6, 10–6తో రెండోసీడ్‌ అడెలినా బరవి–విక్టోరియా మిఖైలోవా (రష్యా) జంటను కంగుతినిపించింది. క్వార్టర్స్‌లో 6–3, 6–3తో అండ్రియానా పినో–గియా స్వార్‌సియాలుప్‌ (ఇటలీ) జోడీపై, ప్రిక్వార్టర్స్‌లో 6–1, 6–1తో ఒలింపి లాన్స్‌లాట్‌ (ఫ్రాన్స్‌)–డెనిజ్‌ పాకోవ్‌ (టర్కీ) జంటపై విజయం సాధించారు.

సింగిల్స్‌ విభాగంలో వీరిద్దరూ తొలిరౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో శ్రావ్య శివాని 3–6, 1–6తో ఎనా కజెవిక్‌ (క్రొయే షియా) చేతిలో, రెండోసీడ్‌ సౌజన్య 1–6, 2–6తో స్టీఫెన్‌ జుడిత్‌ విసెర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లోనూ భారత క్రీడా కారులకు కలిసి రాలేదు. ప్రిక్వార్టర్స్‌లో తరుణ్‌ అనిరుధ్‌ చిలకలపూడి (భారత్‌)–మాజెద్‌ కిలాని (ట్యునీషియా) జంట 6–7 (7/9), 3–6తో నాలుగోసీడ్‌ ఇగ్నాసియో కారో–ఫెమిన్‌ టెంటి (అర్జెంటీనా) జంట చేతిలో... అనిరుధ్‌ చంద్రశేఖర్‌–విఘ్నేశ్‌ పెరణమల్లూర్‌ (భారత్‌) ద్వయం 4–6, 5–7తో మూడోసీడ్‌ మాట్స్‌ హెర్మన్స్‌–బార్ట్‌ స్టీవెన్స్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విజేతలు విష్ణు, దియా

తను అద్భుతం చేశాడు: కోహ్లి

సాకేత్‌ జంటకు టైటిల్‌

వినేశ్‌ ఫొగాట్‌ హ్యాట్రిక్‌

మెరిసిన భారత రెజ్లర్లు

హామిల్టన్‌ హవా

తమిళ్‌ తలైవాస్‌ విజయం

ఇంగ్లండ్‌ లక్ష్యం 398

సాత్విక్‌–చిరాగ్‌ జంట చిరస్మరణీయ విజయం

సిరీస్‌ పరవశం

విజేత హామిల్టన్‌..వ్యూహంతో కొట్టారు

రెండో టీ20; రోహిత్‌ హాఫ్‌ సెంచరీ

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

ఆమ్రేకు పోటీగా రాథోడ్‌

సాత్విక్‌-చిరాగ్‌ జోడి కొత్త చరిత్ర

స్మిత్‌ ఫామ్‌పై ఇంగ్లండ్‌ టెన్షన్‌!

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

పాపం వార్నర్‌.. చేసేది లేక ఇలా!

సైనీని వద్దన్నారు.. ఇప్పడేమంటారు బాస్‌!

పంత్‌.. నువ్వు మారవా!

శభాష్‌ సైనీ..

యువీ మళ్లీ చెలరేగాడు.. కానీ

చాంపియన్‌ రజత్‌ అభిరామ్‌

చెస్‌ విజేతలు లక్ష్మి, ధ్రువ్‌

వారియర్స్‌కు బుల్స్‌ దెబ్బ

భారత్‌ ‘ఎ’ ఘనవిజయం

ఫైనల్లో సాత్విక్‌ – చిరాగ్‌ జోడి

ఆసక్తికరంగా యాషెస్‌ టెస్టు

చెమటోడ్చి ఛేదన..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం