ప్రపంచకప్‌కు ఒక్కరోజు ముందు సంచలనం

13 Jun, 2018 19:52 IST|Sakshi
ఫెర్నాండో హియర్రో, జులెన్‌ లోపెటిగుయ్‌

ఫిఫా ప్రపంచ కప్‌ ఆరంభానికి ఒక్కరోజు ముందు స్పానిష్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఆర్‌ఎఫ్‌ఈఎఫ్‌) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కోచ్‌ జులెన్‌ లోపెటిగుయ్‌ను తప్పించి ఫెర్నాండో హియర్రోను నియమించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం(జూన్‌ 15న) పోర్చుగల్‌తో తలపడబోతున్న స్పెయిన్‌ జట్టు ఆటపై ఈ అనూహ్య నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత నెలలోనే ప్రధాన కోచ్‌గా నియమితులయిన జులెన్‌ 2020 వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అర్ధంతరంగా కోచ్‌ పదవి నుంచి తప్పించారు. జులెన్‌ను స్థానిక క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌ జట్టు మేనేజర్‌గా ఆర్‌ఎఫ్‌ఈఎఫ్ నియమించింది. 2010 ఫిఫా చాంపియన్‌ అయిన స్పెయిన్‌ ఈసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కోచ్‌ జులెన్‌ నిష్ర్కమణతో దిగ్గజ జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాలి. 


 

మరిన్ని వార్తలు