రికార్డు స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌కు కరోనా బాధితుడు

12 Mar, 2020 16:14 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించిన ఓ అభిమానికి కరోనా వైరస్‌ సోకింది. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో చికిత్స అందిస్తున్నారు.ఆ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్దారణ కావడం ఇప్పుడు ఆస్ట్రేలియాను వణికిస్తోంది. మార్చి 8వ తేదీన ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.  ఆ మ్యాచ్‌లో ఆసీస్‌  ఘన విజయం సాధించి ఐదోసారి కప్‌ను ఎగరేసుకుపోయింది.(మహిళల క్రికెట్‌లో ప్రపంచ రికార్డు!)

కాగా, ఆ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని ఆస్ట్రేలియాలోని ఆరోగ్య సేవల విభాగం స్పష్టం చేసింది. దాంతో అక్కడ ఆందోళన మరింత ఎక్కువైంది. కరోనా వైరస్‌ నిర్దారణ అయిన వ్యక్తి మ్యాచ్‌ను చూసే క్రమంలో నార్త్‌ స్టాండ్‌లోని లెవల్‌2లో ఎన్‌ 42 సీట్లో కూర్చున్నట్లు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ) నిర్వాహకులు గుర్తించారు. దాంతో ఆ పరిసర ప్రాంతాల్లో కూర్చొన్న మిగతా అభిమానులు జాగ్రతగా ఉండాలని సూచించారు. వారికి ఏదైనా అనారోగ్యం సోకితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. (షఫాలీని అలా చూడటం కష్టమైంది: బ్రెట్‌ లీ)

మరిన్ని వార్తలు