సాగర తీరాన సగర్వంగా...

12 Dec, 2016 14:49 IST|Sakshi
సాగర తీరాన సగర్వంగా...

రెండో టెస్టులో భారత్ ఘన విజయం 
ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం 
మూడో టెస్టు 26 నుంచి మొహాలీలో

అనుకున్నట్లే విశాఖ నగరం అరంగేట్ర టెస్టులో భారత జట్టుకు విజయాన్ని ఇచ్చింది. రాజ్‌కోట్ టెస్టులో ఫ్లాట్ పిచ్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన భారత జట్టు... మన శైలికి సరిపోయే వికెట్‌పై అదరగొట్టింది. ఇంగ్లండ్ జట్టు అంత తేలికగా తలవంచకపోరుునా... ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోహ్లి సేన సాగరతీరాన సగర్వంగా ఘన విజయం సాధించింది. భారత్‌లో ఆఖరి రోజు పిచ్‌పై రోజంతా ఆడి టెస్టును కాపాడుకోవడం ఏ జట్టుకూ అంత  తేలికకాదు. కాస్త పోరాడినా ఇంగ్లండ్‌కు కూడా అది అసాధ్యమే. రెండో టెస్టులో చివరి రోజు 90 ఓవర్ల పాటు ఆడితే మ్యాచ్‌ను రక్షించుకునే స్థితిలో... కుక్ సేన 38.1 ఓవర్ల పాటు పోరాడి చేతులెత్తేసింది. ఆఖరి రోజు 71 పరుగులకే ఇంగ్లండ్  మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోరుు ఓటమిని మూటగట్టుకుంది. 

విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి మూడు ఫార్మాట్లు.... ముగ్గురు ప్రత్యర్థులు... .మూడు విజయాలు... ఈ ఏడాది విశాఖ నగరంలో భారత్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరిలో శ్రీలంకపై టి20లో, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌పై వన్డేలో గెలిచిన భారత్... తాజాగా టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్ 246 పరుగులతో ఘన విజయం సాధించింది. సోమవారం ఐదో రోజు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్‌‌సలో 97.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటరుుంది. జో రూట్ (107 బంతుల్లో 25; 3 ఫోర్లు) 123 నిమిషాల పాటు పోరాడాడు. బెరుుర్‌స్టో (40 బంతుల్లో 34 నాటౌట్; 7 ఫోర్లు) ఒక ఎండ్‌లో నిలకడగా ఆడినా... రెండో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. భారత బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా... షమీ, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రా కాగా... ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టెస్టు ఈనెల 26 నుంచి మొహాలీలో జరుగుతుంది.

సెషన్-1    ఐదు వికెట్లు
చివరి రోజు నాలుగో ఓవర్‌లో అశ్విన్ బౌలింగ్‌లో రూట్ ఇచ్చిన క్యాచ్‌ను లెగ్ స్లిప్‌లో కోహ్లి వదిలేశాడు. అరుుతే తన తర్వాతి ఓవర్లోనే అశ్విన్... డకెట్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపి భారత్‌కు బోణీ వికెట్ అందించాడు. అశ్విన్ తర్వాతి ఓవర్లో రూట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చినట్లు భావించి అంపైర్ అవుట్ ఇచ్చారు. అరుుతే రూట్ రివ్యూ చేయగా నాటౌట్ అని తేలింది. రూట్, మొరుున్ అలీ తొమ్మిది ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. అరుుతే జడేజా బౌలింగ్‌లో మొరుున్ డిఫెన్‌‌స ఆడబోరుు ఎక్స్‌ట్రా బౌన్‌‌సతో షార్ట్ లెగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. 80 ఓవర్లు పూర్తయ్యాక భారత్ కొత్త బంతిని తీసుకుని కూడా రెండు ఎండ్‌లలో స్పిన్నర్లను కొనసాగించింది. జడేజా స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన జయంత్... తన రెండో ఓవర్లో స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. మరో ఎండ్‌లో అశ్విన్ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన షమీ... తన రెండో ఓవర్లో రూట్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. బ్యాట్స్‌మన్ రివ్యూ అడిగినా ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. 3 ఓవర్ల పాటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... షమీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రషీద్ అవుట య్యాడు. తర్వాత బెరుుర్‌స్టో మూడు ఫోర్లు కొట్టి ఈ సెషన్‌ను ముగించాడు. ఓవర్లు: 33.4 పరుగులు: 55 వికెట్లు:  5

సెషన్-2   20 నిమిషాల్లోనే...
ఈ సెషన్ రెండో ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్‌లో అన్సారీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఓ ఎండ్‌లో బెరుుర్‌స్టో నిలబడినా... రెండో ఎండ్‌లో జయంత్ యాదవ్ వరుస బంతుల్లో బ్రాడ్, అండర్సన్‌లను ఎల్బీగా అవుట్ చేశాడు. ఈ రెండు వికెట్లూ రివ్యూకు వెళ్లినా ఫలితం ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా వచ్చింది. లంచ్ తర్వాత కేవలం 20 నిమిషాల్లోనే ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ విజయం పూర్తరుుంది. ఓవర్లు: 4.3 పరుగులు: 16 వికెట్లు: 3

2  పరుగుల పరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇది రెండో (246) అతి పెద్ద విజయం. 1986లో హెడింగ్లీలో 279 పరుగుల తేడాతో గెలిచింది.
10 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు పది మంది ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యారు. ఆ జట్టు చరిత్రలో ఇదే అత్యధికం.
►  110 రెండు ఇన్నింగ్స్‌లలోనూ అండర్సన్ తొలి బంతికే డకౌట్ (కింగ్ పెయిర్) అయ్యాడు. 1906 తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇలా అవుటవడం ఇదే తొలిసారి.

ఈ మైదానం నాకు బాగా కలిసొచ్చింది. ఇది నాకు ప్రత్యేకం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ కూడా అంతే. ఎక్కువ మంది అభిమానులు మైదానానికి వచ్చి మద్దతిస్తే... కష్ట సమయంలోనూ ఉత్సాహం తగ్గదు. తొలి ఇన్నింగ్‌‌సలో భారీ స్కోరు చేయడం ఈ విజయంలో కీలకం. ఫాస్ట్ బౌలర్లతో పాటు అరంగేట్రంలోనే జయంత్ యాదవ్ రాణించడం చెప్పుకోదగ్గ అంశాలు. మేం మెరుగైన క్రికెట్ ఆడుతున్నాం. ఎలాంటి అలసత్వం లేకుండా సిరీస్‌ను కొనసాగిస్తాం. ఇంగ్లండ్ బలమైన జట్టు. ఆ జట్టును గౌరవిస్తాం.  - విరాట్ కోహ్లి, భారత కెప్టెన్

ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించింది. రెండో రోజు ఐదు వికెట్లు కోల్పోయాక కూడా మేం పోరాడాం. ఈ విజయం కోసం భారత్ బాగా కష్టపడేలా చేశాం. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. అరుుతే అది మ్యాచ్ మొత్తం జరగలేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలవడం కోసం మరింత కష్టపడతాం.  - కుక్, ఇంగ్లండ్ కెప్టెన్

మరిన్ని వార్తలు