పావెల్‌కు దూరమైన స్పాన్సర్

19 Jul, 2013 05:44 IST|Sakshi

కింగ్‌స్టన్: డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలిన జమైకా స్ప్రింటర్ అసఫా పావెల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చెనాకు చెందిన స్పోర్ట్స్ కంపెనీ లీ-నింగ్ ఈ అథ్లెట్‌తో తమకున్న స్పాన్సర్‌షిప్‌ను సస్పెన్షన్‌లో ఉంచింది. ఇప్పటిదాకా అతడి విజయాలు, కఠోర శ్రమపైతమకు గౌరవముందని, అయితే విచారణ పూర్తయ్యేదాకా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది.
 
  ‘ఒకవేళ పావెల్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలితే వెంటనే అతడితో మా ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటాం. నిజాయతీలేని ఆటతీరుకు మేం పూర్తి వ్యతిరేకం’ అని లీ-నింగ్ తెలిపింది.
 

మరిన్ని వార్తలు