స్పోర్టింగ్‌ ఎలెవన్‌ 335 ఆలౌట్‌

2 Aug, 2018 10:30 IST|Sakshi

  భవేశ్‌ సేత్‌ సెంచరీ

  ఎస్‌బీఐకి 20 పరుగుల ఆధిక్యం

  మూడు రోజుల క్రికెట్‌ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీఏ ఎ–1 డివిజన్‌ మూడు రోజుల క్రికెట్‌ లీగ్‌లో భాగంగా స్పోర్టింగ్‌ ఎలెవన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. బుధవారం ఆట రెండోరోజు తొలిఇన్నింగ్స్‌ ప్రారంభించిన స్పోర్టింగ్‌ ఎలెవన్‌ 71 ఓవర్లలో 335 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఎస్‌బీఐకి 20 పరుగుల ఆధిక్యం లభించింది. స్పోర్టింగ్‌ ఎలెవన్‌ బ్యాట్స్‌మన్‌ భవేశ్‌ సేత్‌ (138 బంతుల్లో 104; 16 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... తనయ్‌ త్యాగరాజన్‌ (79), యుధ్‌వీర్‌ సింగ్‌ (57) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సయ్యద్‌ అహ్మద్‌ 5 వికెట్లతో చెలరేగాడు. రవికిరణ్‌ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఎస్‌బీఐ ఆటముగిసే సమయానికి 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. నేడు ఆటకు చివరి రోజు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌: 137 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌: 63/4 (32 ఓవర్లలో), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్‌: 246 (జి. శ్యామ్‌ సుందర్‌ 101, ఆర్‌ఏ విశ్వనాథ్‌ 67; రాజమణి ప్రసాద్‌ 3/43, మికిల్‌ జైస్వాల్‌ 3/82).

జెమిని ఫ్రెండ్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 135 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌: 36/0, ఎవర్‌గ్రీన్‌ తొలి ఇన్నిం గ్స్‌: 344/8 (కుమార్‌ ఆదిత్య 113 నాటౌట్, టి. రోహన్‌ 41; అబ్దుల్‌ ఖురేషి 4/72).

బీడీఎల్‌ తొలి ఇన్నింగ్స్‌: 337 ఆలౌట్‌ (టి. సంతోష్‌ గౌడ్‌ 47, ఆకాశ్‌ సనా 48; శుభమ్‌ బిస్త్‌ 6/94), జై హనుమాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 86/3 (38 ఓవర్లలో).

కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 414 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌: 75/2 (23 ఓవర్లలో), ఇండియా సిమెంట్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 148 (మొహమ్మద్‌ ఫహాద్‌ 6/34).  

దయానంద్‌ సీసీ తొలి ఇన్నింగ్స్‌: 246 ఆలౌట్, ఆంధ్రాబ్యాంక్‌ తొలి ఇన్నింగ్స్‌: 293/8 (టి. రవితేజ 82, అమోల్‌ షిండే 102 బ్యాటింగ్‌).

హైదరాబాద్‌ బాట్లింగ్‌ తొలి ఇన్నింగ్స్‌: 197 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌: 60/1 (రవీందర్‌ 34), కాంటినెంటల్‌ తొలి ఇన్నింగ్స్‌: 277 (హృషికేశ్‌ 66, ఒమర్‌ మొహమ్మద్‌ 43; జయరామ్‌ 3/80, బి. అఖిలేశ్‌ రెడ్డి 3/68). 

>
మరిన్ని వార్తలు