చాంప్స్ శ్రీహర్ష, అభిరామ్

1 Jan, 2017 10:34 IST|Sakshi

 ఇన్విటేషన్ చెస్ టోర్నమెంట్  


సాక్షి, హైదరాబాద్: ఇన్విటేషన్ ఓపెన్, చిన్నారుల ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో శ్రీహర్ష, అభిరామ్ విజేతలుగా నిలిచారు. మణికొండలో జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో ఆర్మీ స్కూల్‌కు చెందిన శ్రీహర్ష శర్మ  టైటిల్‌ను దక్కించుకోగా గౌరీశ్వర్ రావు, జె. బి. సత్య వరుసగా రెండు, మూడు స్థానాల్ని దక్కించుకున్నారు. అండర్-15 విభాగంలో అభిరామ్ యాదగిరి చాంపియన్‌గా నిలిచాడు.

 ఇతర విజేతల వివరాలు
 సాద్విక్ రెడ్డి (అండర్-14), లలిత్ మండువ (అండర్-13), అన్షురామ్ యాదగిరి (అండర్-12), చిరాయు నాథ్ (అండర్-10), చిరంజీవి ఇనగంటి (అండర్- 7).    

 

మరిన్ని వార్తలు