ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ  విరాళం

9 Apr, 2020 17:10 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తమ వంతు సాయాన్ని ప్రకటించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ. 10 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో విరాళం విషయాన్ని స్పష్టం చేసింది. కరోనాపై జరుగుతున్న పోరాటానికి తమ వంతు సాయంగా 10 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపింది. (పీఎం కేర్స్‌కు యువీ విరాళం)

అయితే అది ఏ సహాయ నిధికి ఇస్తున్నారో కచ్చితంగా తెలపలేదు. దీనిపై సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం స్పందించాడు. సన్‌టీవీ గ్రూప్‌ మంచి పనికి నడుం బిగించడం హర్షణీయమని వార్నర్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో  పేర్కొన్నాడు. ఇప్పటికే పలువురు క్రికెటర్లతో పాటు బీసీసీఐ కూడా తమ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. యువరాజ్‌సింగ్‌ రూ. 50 లక్షలు,  రోహిత్‌ శర్మ రూ. 80 లక్షలు, సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు, విరాట్‌ కోహ్లి దంపతులు రూ. 3 కోట్ల విరాళాన్ని ఇచ్చారు. 

మరిన్ని వార్తలు