మనీష్‌ పాండే మెరిసినా..

27 Apr, 2019 21:49 IST|Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కవ శనివారం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 161 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మనీష్‌ పాండే(61; 36 బంతుల్లో 9 ఫోర్లు) మాత్రమే ఆకట్టుకోవడంతో సన్‌రైజర్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ 23 పరుగుల వద్ద కెప్టెన్‌ కేన్‌విలియన్స్‌(13) వికెట్‌ను నష్టపోయింది.  ఆ తరుణంలో డేవిడ్‌ వార్నర్‌-మనీష్‌ పాండేల జోడి నిలకడగా ఆడింది.

ఈ క్రమంలోనే మనీష్‌ పాండే 27 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 75 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్‌(37)రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి మనీష్‌ పాండే కూడా ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ తడబాటుకు గురైంది. వార్నర్‌, మనీష్‌ పాండేల తర్వాత ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. చివరి ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌(17 నాటౌట్‌) ఫోర్‌, సిక్స్‌ కొట్టడంతో  సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.  విజయ్‌ శంకర్‌(8), షకిబుల్‌ హసన్‌(9), దీపక్‌ హుడా(0), సాహా(5)లు ఘోరంగా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో ఉనాద్కత్‌, శ్రేయస్‌ గోపాల్‌, ఓషాన్‌ థామస్‌, వరుణ్‌ అరోన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.

మరిన్ని వార్తలు