ఫిక్సింగ్‌ కలకలం.. ఇద్దరిపై నిషేధం

28 May, 2018 16:42 IST|Sakshi
క్రికెట్‌ మైదానం (ప్రతికాత్మక చిత్రం)

కొలంబో : ‘ఆల్‌ జజీరా’ స్టింగ్‌ ఆపరేషన్‌లో ఫిక్సింగ్‌ పాల్పడినట్లు ఒప్పుకున్న పిచ్‌ క్యూరేటర్‌, గ్రౌండ్స్‌మన్‌పై వేటు వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. నవంబర్‌లో ఇంగ్లండ్‌తో గాలే వేదికగా జరిగే టెస్టు మ్యాచ్‌ ఫలితం ప్రభావితమయ్యేలా ఫిచ్‌ను సిద్దం చేస్తామని ఈ ఇద్దరు తెలిపినట్లు స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ ఘటనతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. అంతేగాకుండా స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌తో ఉలిక్కిపడ్డ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి సైతం దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన జర్నలిస్ట్‌ డేవిడ్‌ హారిసన్‌తో కొలంబో ఆటగాడు తరిందు మెండీస్‌, గాలె పిచ్‌ క్యూరేటర్‌ తరంగ ఇండికాలు ఫలితాన్ని ప్రభావం చేసేలా పిచ్‌ను సిద్దం చేస్తామని ఒప్పుకున్నారు. గతంలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్‌–లంక టెస్టుల్లో సైతం పిచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు కూడా వెల్లడించారు. ఇక ఈ వివాదంలో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ రాబిన్‌ మోరిస్‌ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు.

చదవండి: మూడు టెస్టులు ఫిక్స్‌!

>
మరిన్ని వార్తలు