మైదానంలోకి లంక క్రికెటర్లు.. 

31 May, 2020 15:01 IST|Sakshi

కొలంబొ: కరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రికెట్‌ టోర్నీలు జరగలేదు. అయితే అనేక దేశాలు లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్‌ పునరుద్దరణకు బాటలు పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే త్వరలోనే క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) బౌలర్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌ బాటలో మరిన్ని దేశాలు పయనించేందుకు సిద్దమవుతున్నాయి. (‘ఇదేందయ్య ఇది.. నేనెప్పుడు చూడలేదు’)

తాజాగా శ్రీలంక తమ ఆటగాళ్ల కోసం ముఖ్యంగా బౌల​ర్ల కోసం ట్రెయినింగ్‌ సెషన్‌ ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరం సోమవారం నుంచి ప్రారంభం కానుందని, ఇందులో 13 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారని శ్రీలంక క్రికెట్‌ బోర్డు తెలిపింది. ​కొలంబో క్రికెట్‌ క్లబ్‌లో 12 రోజుల పాటు సాగనుందని వివరించింది. అంతేకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇక అన్నీ కుదిరితే జులైలో స్వదేశంలో టీమిండియాతో వన్డే/టీ20 సిరీస్‌ నిర్వహించాలని శ్రీలంక భావిస్తోంది. అయితే కరోనా పరిస్థితులు, అంతర్జాతీయ సర్వీసుల పునరుద్దరణ తర్వాతే తమ నిర్ణయం ఏంటో చెప్పగలమని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఇక దక్షిణాఫ్రికా కూడా క్రికెట్‌ పునరుద్దరణ చర్యలు చేపట్టింది. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేర్వేరు మైదానాల్లో తమ ఆటగాళ్ల కోసం ట్రైయినింగ్‌ సెషన్స్‌ ఏర్పాటు చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. (సచిన్‌ ఈ రికార్డును తిరగరాయ్‌.. యువీ ఛాలెంజ్‌)  

మరిన్ని వార్తలు