ఆదుకున్న డికాక్, మార్క్‌రమ్‌

22 Feb, 2019 03:14 IST|Sakshi

దక్షిణాఫ్రికా 222 ఆలౌట్‌

శ్రీలంక 60/3 

పోర్ట్‌ఎలిజబెత్‌: పర్యాటక జట్టు శ్రీలంక చేతిలో తొలి టెస్టు ఓడిపోయిన దక్షిణాఫ్రికా ... రెండో టెస్టులోనూ తడబడింది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 222 పరుగులు చేసింది. 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాను మార్క్‌రమ్‌ (116 బంతుల్లో 60; 9 ఫోర్లు), క్వింటన్‌ డికాక్‌ (87 బంతుల్లో 86; 12 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో, రజిత చెరో 3 వికెట్లు పడగొట్టారు. ధనంజయ డిసిల్వా 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక తొలిరోజు ఆటముగిసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులు చేసింది. లహిరు తిరిమన్నే (25 బ్యాటింగ్‌), కసున్‌ రజిత (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.    

  

మరిన్ని వార్తలు