మరో పరాభవం తప్పదనుకున్నాం.. కానీ!

19 Jul, 2017 12:26 IST|Sakshi
మరో పరాభవం తప్పదనుకున్నాం.. కానీ!

రికార్డు ఛేదనపై లంక క్రికెటర్ గుణరత్నే హర్షం
కొలంబో: అంచనాలకు అందని రీతిలో సంచలన ఆటతీరును ప్రదర్శించి శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 3–2తో దక్కించుకున్న జింబాబ్వే చేతిలో ఆ జట్టు మరో పరాభవాన్ని తప్పించుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. జింబాబ్వేకు వన్డే సిరీస్ ను కోల్పోయిన లంకేయులు ఏకైక టెస్టులో 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. జట్టు కష్ట సమయంలో క్రీజులోకొచ్చిన గుణరత్నే(151 బంతుల్లో 80 నాటౌట్‌; 6 ఫోర్లు)తో కలిసి డిక్వెల్లా(118 బంతుల్లో 81; 6 ఫోర్లు) ఇన్నింగ్స్ ను నిర్మించి విజయానికి బాటలు వేశాడు. ఈ విజయంపై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో గుణరత్నే హర్షం వ్యక్తం చేశాడు.

'203 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయాం. విజయానికి మరో 185 పరుగులు కావాలి. వన్డే సిరీస్ లాగ మరో పరాభవం తప్పదనిపించింది. అయితే భారీ ఇన్నింగ్స్ లు అలవాటు లేకున్నా డిక్ వెల్లా నాకు స్ఫూర్తిగా నిలిచాడు. డిక్ వెల్లా ప్లాన్ వల్లే గెలుస్తామనుకున్న జింబాబ్వేకు దిమ్మతిరిగింది. తరచుగా డిక్వెల్లా తన వద్దకు వచ్చి మాట్లాడమన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో చెప్పడానికి సలహాలు ఇవ్వమంటూనే పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వమన్నాడు. లక్ష్యాన్ని త్వరగా చేరుకునే క్రమంలో జింబాబ్వేపై డిక్ వెల్లా ఒత్తిడి పెంచాడు. 121 పరుగుల కీలక భాగస్వామ్యం అనంతరం డిక్ వెల్లా ఔటయ్యాక  దిల్ రువాన్ పెరీరాతో జట్టును విజయతీరాలకు చేర్చడం మరిచిపోలేని అనుభూతి అని' గుణరత్నే వెల్లడించాడు.

ఆసియాలో ఇతే అత్యుత్తమ ఛేదన కావడంతో పాటు ఓవరాల్ గా టెస్టుల్లో ఐదో అత్యుతమ ఛేదనను లంక తమ ఖాతాలో వేసుకుంది. గతంలో 2006లో దక్షిణాఫ్రికాపై 352 పరుగుల ఛేదనే ఇప్పటిదాకా లంక రికార్డు ఛేదనగా ఉండేది. మరోవైపు 11 వికెట్లు తీసిన లంక స్పిన్నర్‌ హెరాత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.

మరిన్ని వార్తలు