శ్రీలంక క్లీన్ స్వీప్

18 Aug, 2016 01:51 IST|Sakshi

చివరి టెస్టులో ఆసీస్‌పై విజయం
 కొలంబో: శ్రీలంక జట్టు తమ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ పెద్దజట్టును వైట్‌వాష్ చేయగలిగింది. ఆస్ట్రేలియాతో చివరిదైన మూడో టెస్టును నెగ్గిన లంక 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 324 పరుగుల లక్ష్యంతో చివరి రోజు బుధవారం బరిలోకి దిగిన ఆసీస్ జట్టు స్పిన్నర్ రంగన హెరాత్ (7/64) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆతిథ్య జట్టు 163 పరుగుల తేడాతో నెగ్గింది.  డేవిడ్ వార్నర్ (68) మినహా ఎవరూ రాణించలేదు. అంతకుముందు శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 99.3 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవరాల్‌గా 13 వికెట్లతో చెలరేగిన హెరాత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ పురస్కారం కూడా దక్కింది. ఈనెల 21 నుంచి ఇరుజట్ల మధ్య నాలుగు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.
 

>
మరిన్ని వార్తలు