శ్రీలంక ప్రధాన కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

8 Aug, 2019 12:10 IST|Sakshi

కొలంబో: శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ చండికా హతురుసింఘాపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.  స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు హతురుసింఘా సేవలు అందించడం లేదని బోర్డు పేర్కొంది. అతని స్థానంలో తాత్కాలిక కోచ్‌గా రుమేష్‌ రత్ననాయకేయను నియమించింది. వరల్డ్‌కప్‌లో లంక పేలవ ప్రదర్శన కారణంగానే హతురసింఘాను తప్పించినట్లు తెలుస్తోంది. కాగా, హతురుసింఘాను తప్పించడానికి గల కారణాలను క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ షిమ్మి సిల్వా వెల్లడించలేదు.  హతురసింఘాకు భారీ మొత్తంలో నెలవారీ జీతం చెల్లిస్తున్న క్రమంలో అతని సేవలు అవసరం లేదని భావించే శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

హతురసింఘాకు నెలవారీ జీతం 40 వేల డాలర్లు కాగా, ఒక విదేశీ కోచ్‌ అందులో సగానికి వస్తాడని సదరు బోర్డు భావిస్తోంది. శ్రీలంక క్రికెట్‌ ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయడానికి ఇప్పటికే ముగ్గురు పేర్లను పరిశీలించినట్లు ఆ దేశ క్రీడా మంత్రి హరిన్‌ ఫెర్నాండో పేర్కొన్నారు. 2017లో హతురుసింఘాను ప్రధాన కోచ్‌గా నియమించారు. శ్రీలంక జట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో హతురసింఘా కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే హతురుసింఘా పర్యవేక్షణలో కూడా లంక జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. వరల్డ్‌కప్‌లో అయితే లంక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు ఆరోస్థానంలో నిలిచి లంక బోర్డు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేసింది. ఈ క్రమంలోనే లంక జట్టులో ప్రక్షాళన చేపట్టడానికి శ్రీకారం చుట్టారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తున్నాడు’

‘టెక్నికల్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ కాదు’

ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట

అన్సారీకి స్వర్ణ పతకం

శ్రీథన్‌కు కాంస్యం

కోచ్‌ మికీ ఆర్థర్‌కు పాక్‌ గుడ్‌బై

హరియాణా స్టీలర్స్‌ గెలుపు

భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి

భారత స్టార్స్‌కు చుక్కెదురు

మా డబ్బులిస్తేనే ఆడతాం!

బోపన్న జంట సంచలనం

సింధు సంపాదన రూ.39 కోట్లు

నిఖత్‌ జరీన్‌కు షాక్‌!

ఇక వన్డే సమరం

బలిపశువును చేశారు.. పాక్‌ కోచ్‌ ఆవేదన

ఎవరు సాధిస్తారు.. కోహ్లినా? గేలా?

ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ

‘సాహోరే చహర్‌ బ్రదర్స్‌’

‘ప్రధాన కోచ్‌ను కొనసాగించే ముచ్చటే లేదు ’

నేటి క్రీడా విశేషాలు

ధోని రికార్డును బ్రేక్‌ చేసిన పంత్‌

ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా.. సింధు!

ఇదో ఫ్యాషన్‌ అయిపోయింది; గంగూలీ ఫైర్‌!

లదాఖ్‌ క్రికెటర్లు కశ్మీర్‌ తరఫున...

ద్రవిడ్‌కు అంబుడ్స్‌మన్‌ నోటీస్‌

దులీప్‌ ట్రోఫీకి రికీ భుయ్, అక్షత్‌

భారత్‌ తరఫున 81వ ప్లేయర్‌గా రాహుల్‌ చహర్‌

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జంట

భారత బౌలింగ్‌ కోచ్‌ పదవికి సునీల్‌ జోషి దరఖాస్తు

కోహ్లికి స్మిత్‌ ఏమాత్రం తీసిపోడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..