తొలి టి20లో పాక్‌పై లంక గెలుపు

6 Oct, 2019 03:50 IST|Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక జట్టు టి20 సిరీస్‌లో శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో శ్రీలంక 64 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గుణతిలక (38 బంతుల్లో 57; 8 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడాడు. 19 ఏళ్ల పాక్‌ బౌలర్‌ హస్నయిన్‌ (3/37) టి20ల్లో హ్యాట్రిక్‌ తీసుకున్న పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. అనంతరం పాక్‌ 17.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో నువాన్‌ ప్రదీప్‌ (3/21), ఉడాన (3/11) రాణించారు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌ సోమవారం జరుగుతుంది.     

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు