శ్రీథన్‌కు కాంస్యం

8 Aug, 2019 10:01 IST|Sakshi

జాతీయ యూత్‌ చెస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అండర్‌–25 యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు సాయ్‌పురి శ్రీథన్‌ రాణించాడు. జమ్మూ వేదికగా జరిగిన ఈ టోర్నీలో 15 ఏళ్ల శ్రీథన్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. ఏడు రౌండ్లపాటు జరిగిన పోటీల్లో శ్రీథన్‌ 6 పాయింట్ల సాధించి మూడో స్థానంలో నిలిచాడు. నిర్ణీత 7 రౌండ్ల అనంతరం ఎస్‌ కుమార్‌ (తమిళనాడు), మోహిత్‌ కుమార్‌ సోని (బిహార్‌), శ్రీథన్‌ తలా 6 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా కుమార్‌ చాంపియన్‌గా, మోహిత్‌ కుమార్‌ రన్నరప్‌గా నిలిచారు. శ్రీథన్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పోటీల్లో భాగంగా 5 విజయాలు నమోదు చేసిన శ్రీథన్‌ మరో రెండు గేముల్ని డ్రాగా ముగించి టోర్నీలో అజేయంగా నిలిచాడు.  తెలంగాణకే చెందిన మరో ప్లేయర్‌ ఆర్‌ఎస్‌ శరణ్‌ 5 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితం కాగా... పవన్‌తేజ 4 పాయింట్లతో 32వ స్థానంలో నిలిచాడు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు