లంకను కట్టడి చేసిన విండీస్

29 Jun, 2013 07:09 IST|Sakshi
లంకను కట్టడి చేసిన విండీస్

 నరైన్‌కు 4, రాంపాల్‌కు 3 వికెట్లు
 సెల్‌కాన్ మొబైల్ కప్
 
 కింగ్‌స్టన్ (జమైకా): సెల్‌కాన్ మొబైల్ కప్ ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్లు చెలరేగారు. స్పిన్నర్ సునీల్ నరైన్ (4/40), రాంపాల్ (3/38) వరుస విరామాల్లో వికెట్లు తీసి శ్రీలంకను కట్టడి చేశారు.
 
  శుక్రవారం సబీనా పార్కులో జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన లంక 48.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మాథ్యూస్ (77 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు) ఒంటరిపోరాటం చేయగా... జయవర్ధనే (52 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు ఉపుల్ తరంగ (43 బంతుల్లో 25; 3 ఫోర్లు), జయవర్ధనే శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు.
 
 అయితే విండీస్ బౌలర్లు రెండువైపుల నుంచి ఒత్తిడి పెంచడంతో సంగక్కర (17), చండిమాల్ (21), తిరిమన్నే (6) నిరాశపర్చారు. మాథ్యూస్ నిలదొక్కుకున్నా.. మిగతా వారి నుంచి సహకారం కరువైంది. ఓ దశలో పర్యాటక జట్టు 151 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. చివర్లో నరైన్, రాంపాల్ మరోసారి విజృంభించడంతో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా ఒక్క అంకె స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో లంక 208 పరుగులతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. డ్వేన్ బ్రేవోకు 2, శామ్యూల్స్‌కు ఒక్క వికెట్ దక్కింది.
 
 స్కోరు వివరాలు
 శ్రీలంక ఇన్నింగ్స్: తరంగ (సి) రామ్‌దిన్ (బి) డ్వేన్ బ్రేవో 25; జయవర్ధనే (సి) రామ్‌దిన్ (బి) నరైన్ 52; సంగక్కర (సి) పొలార్డ్ (బి) నరైన్ 17; చండిమాల్ (సి) డ్వేన్ బ్రేవో (బి) శామ్యూల్స్ 21; మాథ్యూస్ నాటౌట్ 55; తిరిమన్నే (సి) చార్లెస్ (బి) రాంపాల్ 6; కులశేఖర (సి) పొలార్డ్ (బి) రాంపాల్ 2; జీవన్ మెండిస్ (సి) శామ్యూల్స్ (బి) నరైన్ 5; హెరాత్ (సి) స్యామీ (బి) రాంపాల్ 4; మలింగ ఎల్బీడబ్ల్యూ (బి) నరైన్ 8; జీవన్ మెండిస్ (సి) చార్లెస్ (బి) డ్వేన్ బ్రేవో 2; ఎక్స్‌ట్రాలు (బైస్ 5; లెగ్‌బైస్ 2; వైడ్లు 4) 11; మొత్తం (48.3 ఓవర్లలో ఆలౌట్) 208.
 
 వికెట్లపతనం: 1-62; 2-85; 3-104; 4-140; 5-151; 6-159; 7-176; 8-190; 9-205; 10-208 బౌలింగ్: రోచ్ 7-1-41-0; రాంపాల్ 10-0-38-3; స్యామీ 10-0-34-0; డ్వేన్ బ్రేవో 7.3-0-37-2; నరైన్ 10-0-40-4; శామ్యూల్స్ 4-1-11-1.
 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు