భారత్ విజయ లక్ష్యం 275 పరుగులు

6 Nov, 2014 17:14 IST|Sakshi
భారత్ విజయ లక్ష్యం 275 పరుగులు

అహ్మదాబాద్: కెప్టెన్ మాథ్యూస్, సంగక్కర రాణించడంతో భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక మంచి స్కోరు చేసింది. టీమిండియా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది.

మాథ్యూస్ 92, సంగక్కర 61, దిల్షాన్ 35, ప్రసాద్ 30, ప్రసన్న 13, పెరీరా 10, రణదివ్ 10, జయవర్ధనే 4 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, అశ్విన్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు