లంకదే సిరీస్‌

29 Jul, 2019 02:13 IST|Sakshi
అవిష్క ఫెర్నాండో 

రెండో వన్డేలో బంగ్లాపై గెలుపు 

31న ఆఖరి వన్డే  

కొలంబో : రెండో వన్డేలో బంగ్లాను శ్రీలంక ఆల్‌రౌండ్‌ దెబ్బకొట్టింది. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. మొదట బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (98 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచిత పోరాటం చేశాడు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాను మెహదీ హసన్‌ (43; 6 ఫోర్లు) కలిసి ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. తర్వాత లంక 44.4 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (75 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూస్‌ (57 బంతుల్లో 52 నాటౌట్‌; 7 ఫోర్లు) రాణించారు. కుశాల్‌ మెండిస్‌ (41 నాటౌట్‌; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం ఇక్కడే జరుగుతుంది.  

మరిన్ని వార్తలు