‘సారీ’ పేరు మారింది

27 Sep, 2015 01:28 IST|Sakshi
‘సారీ’ పేరు మారింది

ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో తమ సమావేశాలకు హాజరు కావచ్చో లేదో తెలపాలంటూ సెప్టెంబరు 12వ తేదీన బీసీసీఐ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అందులో శ్రీనివాసన్ తండ్రి పేరు నటేశన్ అయ్యర్‌గా ప్రస్తావించారు. ఈ పేరుగల వ్యక్తి చెన్నైలో ఓ ప్రముఖ ఆడిటర్. ఎన్.శ్రీనివాసన్ తండ్రిపేరు నారాయణ స్వామి. తర్వాత బోర్డు లాయర్లు కాకతాళీయంగా ఈ పిటిషన్‌ను చూస్తే తప్పు కనిపించింది. వెంటనే లబోదిబో మంటూ మళ్లీ కోర్టుకు పరిగెత్తారు. తమ పిటిషన్‌లో పేరు తప్పుగా రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ సెప్టెంబరు 23న దానిని సరిదిద్దుకుని తిరిగి మరో పిటిషన్ సమర్పించారు.

మరిన్ని వార్తలు