సొంత రాష్ట్రంలోనూ శ్రీనివాసన్ హవా

12 Jun, 2015 15:42 IST|Sakshi
సొంత రాష్ట్రంలోనూ శ్రీనివాసన్ హవా

చెన్నై: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ సొంత రాష్ట్రంలోనూ హవా కొనసాగిస్తున్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్ సీఏ) అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన టీఎన్ సీఏ 85వ వార్షిక కార్యవర్గ సమావేశంలో శ్రీనివాసన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

ప్రస్తుత టీఎన్ సీఏ కార్యదర్శి కాశీ విశ్వనాథన్ కూడా తన పదవిని నిలబెట్టుకున్నారు. వీపీ నరసింహన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు