ఆసీస్ కన్సల్టెంట్‌గా శ్రీరామ్

20 Sep, 2015 01:31 IST|Sakshi
ఆసీస్ కన్సల్టెంట్‌గా శ్రీరామ్

చెన్నై : భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్ ఆస్ట్రేలియా జట్టు కన్సల్టెంట్‌గా పనిచేయనున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో శ్రీరామ్ విధులు నిర్వర్తిస్తాడు. ఈ విషయాన్ని సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించనుంది. జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన సహాయాన్ని తీసుకోవాలనుకుంటోంది. మరోవైపు ఆసీస్ సహాయక సిబ్బందిలో పనిచేయబోతున్న తొలి భారతీయుడు శ్రీరామ్ కావడం విశేషం.

గత జూలైలో భారత్‌లో పర్యటించిన ఆసీస్ ‘ఎ’ జట్టుకు తను కన్సల్టెంట్‌గా కీలక సేవలందించాడు. రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌ను ఆ జట్టు 1-0తో దక్కించుకుంది. దీంతో అతడి సేవలను తమ సీనియర్ జట్టుకు వినియోగించుకోవాలని సీఏ భావించింది.

మరిన్ని వార్తలు