సెమీస్‌లో సృష్టి గుప్తా, వరుణి జైస్వాల్‌

21 Sep, 2019 10:13 IST|Sakshi

రాష్ట్ర ర్యాంకింగ్‌ టీటీ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ స్మారక స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సృష్టిగుప్తా (ఏవీఎస్‌సీ), వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం), జి. ప్రణీత (హెచ్‌వీఎస్‌), బి. రాగనివేదిత (జీటీటీఏ) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో సృష్టి 10–12, 11–5, 11–4, 9–11, 11–6, 8–11, 11–3తో సస్య (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా... వరుణి 4–12, 13–15, 11–7, 11–9, 11–9తో లాస్య (ఏడబ్ల్యూఏ)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణీత 11–6, 11–7, 11–5, 11–6తో దియా వోరా (హెచ్‌వీఎస్‌)పై, రాగ నివేదిత 6–11, 11–8, 11–9, 1–11, 11–8, 11–7తో మోనిక (జీఎస్‌ఎం)పై గెలుపొందారు. యూత్‌ బాలికల విభాగంలో రాగ నివేదిత, సస్య, ప్రణీత, వరుణి జైస్వాల్‌ సెమీస్‌కు చేరుకున్నారు. క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో రాగ నివేదిత 11–8, 9–11, 11–5, 11–2, 11–4తో ఇక్షిత (ఏడబ్లూఏ)పై, ప్రణీత 12–10, 11–8, 11–7, 11–7తో హనీఫా ఖాతూన్‌ (వీపీజీ)పై, సస్య 11–8, 11–7, 11–7, 11–4తో కీర్తన (హెచ్‌వీఎస్‌)పై, వరుణి జైస్వాల్‌ 6–11, 11–7, 10–12, 10–12, 11–3, 11–9, 11–9తో సృష్టి గుప్తా (ఏవీఎస్‌సీ)పై నెగ్గారు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
∙క్యాడెట్‌ బాలుర క్వార్టర్స్‌: ధ్రువ్‌సాగర్‌ (జీఎస్‌ఎం) 3–0తో అక్షయ్‌ (ఏడబ్ల్యూఏ)పై, జతిన్‌దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌) 3–0తో చిరంతన్‌ (ప్రొ టీటీ)పై, శౌర్యరాజ్‌ సక్సేనా (ఏవీఎస్‌సీ) 3–1తో రిషభ్‌ సింగ్‌ (వైసీఏఎక్స్‌టీటీఏ)పై, ఆరుశ్‌ (ఏపీజీ) 3–0తో సాయి హర్ష (ఎస్‌పీహెచ్‌ఎస్‌)పై నెగ్గారు.  

∙యూత్‌ బాలుర ప్రిక్వార్టర్స్‌: సాయినాథ్‌ రెడ్డి 4–1తో విశాల్‌పై, వరుణ్‌ శంకర్‌ 4–1తో యశ్‌పై, అమన్‌ 4–1తో ఐనేశ్‌పై, అరవింద్‌ 4–1తో వత్సిన్‌పై, జషాన్‌ సాయి 4–3తో గోవింద్‌ షాపై, కేశవన్‌ కన్నన్‌ 4–0తో రాఘవ్‌ లోయాపై, అలీ మొహమ్మద్‌ 4–2తో సరోజ్‌ సిరిల్‌పై, మొహమ్మద్‌ అలీ 4–0తో త్రిశూల్‌ మెహ్రాపై గెలుపొందారు.  

∙పురుషుల ప్రిక్వార్టర్స్‌: అలీ మొహమ్మద్‌ 4–1తో మొహమ్మద్‌ అలీపై, వరుణ్‌ శంకర్‌ 4–3తో కేశవన్‌పై, సరోజ్‌ 4–0తో అంకిత్‌పై, పీయూశ్‌ 4–0తో సాయినాథ్‌ రెడ్డిపై, అమన్‌ 4–1తో విశాల్‌పై, అరవింద్‌ 4–0తో జుబేర్‌పై, విఘ్నయ్‌ 4–0తో శాశ్వత్‌పై గెలుపొందారు.  

∙పురుషుల క్వార్టర్స్‌: విఘ్నయ్‌ 4–0తో స్వర్ణేందుపై, సరోజ్‌ 4–1తో పీయూశ్‌ పై, అరవింద్‌ 4–2తో అమన్‌పై, వరుణ్‌ శంకర్‌ 4–2తో అలీ మొహమ్మద్‌పై విజయం సాధించారు.  
∙క్యాడెట్‌ బాలికల క్వార్టర్స్‌: జలాని 3–0తో వత్సలపై, శ్రీయ సత్యమూర్తి 3–2తో శ్రేష్టారెడ్డిపై, శ్రీయ 3–1తో తేజస్వినిపై, ప్రజ్ఞాన్ష 3–0తో శరణ్యపై నెగ్గారు.   

మరిన్ని వార్తలు