'మళ్లీ నంబర్ వన్ కావడం ఖాయం'

23 Mar, 2017 15:26 IST|Sakshi
'మళ్లీ నంబర్ వన్ కావడం ఖాయం'

మియామి: గాయం కారణంగా సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకుని ఈ ఏడాది ఆరంభంలో  ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో పునరాగమనం చేసి సత్తా చాటుకున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పై ఆ దేశానికే చెందిన మరో టెన్నిస్ ఆటగాడు స్టాన్ వావ్రింకా ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా మాస్టర్ ఫైనల్ గెలిచిన ఫెడరర్ ఆటను చూస్తుంటే అతను మరొకసారి పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించుకోవడం ఖాయంగా కనబడుతోందన్నాడు. ప్రస్తుతం ఆరో ర్యాంకులో ఉన్న ఫెడరర్.. తిరిగి నంబర్ వన్ చేరుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

'బేస్ లైన్ దగ్గరగా ఫెడరర్ ఆడే ఆటతీరు అద్భుతం. టాప్ స్పిన్ ను ఎక్కువగా ఉపయోగించుకుంటూ ప్రత్యర్థిని ఒత్తిడిలో  పెడుతున్నాడు. అదే క్రమంలో రిటర్న్ షాట్స్ ను కూడా చాలా ఈజీగా కొడుతున్నాడు. లేటు వయసులో ఆస్ట్రేలియా, మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన ఫెడరర్ మరొకసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం ఖాయం'అని వావ్రింకా పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ ను  ఫెడరర్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.  తుదిపోరులో ఫెడరర్ 6-4, 7-5 తేడాతో  వావ్రింకాను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు.

మరిన్ని వార్తలు