ధోనికి ఆ సత్తా ఉంది : కివీస్‌ మాజీ కెప్టెన్‌

1 Dec, 2018 19:38 IST|Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి 2019 ప్రపంచకప్‌ ఆడే సత్తా ఉందని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అభిప్రాయపడ్డాడు. కొద్దీ రోజులగా బ్యాట్‌తో విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న ధోని.. టీ20ల్లో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ధోని వన్డే ప్రపంచకప్‌ ఆడుతాడా? లేదా అనే సందిగ్థం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ధోని జట్టైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ ప్లెమింగ్‌ అతనికి మద్దతుగా నిలిచాడు. భారత్‌కు చాలా అవకాశాలున్నాయనీ, కానీ ధోనికి ప్రపంచకప్‌ ఆడే సత్తా ఉందన్నారు. ఐపీఎల్‌లో అతని బ్యాటింగ్‌ను దగ్గరి నుంచి చూసినట్లు ఓ మీడియా ఛానెల్‌కు తెలిపారు. వన్డే ప్రపంచకప్‌లో అతను రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ ఏడాది 20 వన్డే మ్యాచ్‌లాడిన 25 సగటుతో 275 పరుగులే చేశాడు. దీంతో అతనిపై బ్యాటింగ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లకు అతన్ని ఎంపికచేయలేదన్న విషయం తెలిసిందే. అయితే సెలక్టర్ల నిర్ణయంపై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తప్పుబట్టారు. ధోని బ్యాట్‌ ఝులిపించకపోయినా.. తన మార్క్‌ కీపింగ్‌, అనుభవం, వ్యూహాలు జట్టు విజయానికి తోడ్పడుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాధ్‌ ధోని కెరీర్‌ ముగియలేదని, ప్రత్యామ్నాయ కీపర్‌ కోసమే టీ20లకు పక్కకు పెట్టినట్లు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు