ఆసీస్‌ యాషెస్‌ జట్టు ఇదే..

27 Jul, 2019 12:31 IST|Sakshi

సిడ్నీ:  బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం తర్వాత ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌లు తొలి టెస్టు పర్యటనలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్‌ వేదికగా ఆగస్టు 1వ తేదీ నుంచి ఆరంభం కానున్న యాషెస్‌ సిరీస్‌లో పాల్గొనే జట్టులో ఈ ముగ్గురూ చోటు దక్కించుకున్నారు.  యాషెస్‌ సిరీస్‌లో భాగంగా 17 మందితో కూడిన ఆసీస్‌ జట్టును శుక్రవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. ఇందులో స్మిత్‌, వార్నర్‌తో పాటు బెన్‌క్రాఫ్ట్‌ కూడా చోటు దక్కింది. కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ను ఎంపిక చేస్తూ ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా స్మిత్‌, వార్నర్‌, క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని సస్పెన్షన్‌కు గురయ్యారు. వార్నర్‌, స్మిత్‌లకు ఏడాది పాటు నిషేధం విధించిన సీఏ.. బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. ఈ నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత వార్నర్‌, స్మిత్‌లు వరల్డ్‌కప్‌లో పాల్గొన్న ఆసీస్‌ జట్టులో ఆడారు. కాగా, నిషేధం అనంతరం యాషెస్‌ సిరీసే వీరి ముగ్గురికి ఇదే టెస్టు సిరీస్‌ పునరాగమనం.

ఆసీస్‌ యాషెస్‌ జట్టు ఇదే..

టిమ్‌ పైన్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), బెన్‌క్రాఫ్ట్‌, ప్యాట్‌ కమిన్స్‌, మార్కస్‌ హారిస్‌, జోష్‌ హజల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, లబుస్కాంజ్‌, నాథన్‌ లయన్‌, మిచెల్‌ మార్ష్‌, మిచెల్‌ నాసెర్‌, జేమ్స్‌ పాటిన్సన్‌, పీటర్‌ సిడెల్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌

మరిన్ని వార్తలు