స్టీవ్ స్మిత్.. మళ్లీ ఆరేశాడు

25 Mar, 2017 14:00 IST|Sakshi
స్టీవ్ స్మిత్.. మళ్లీ ఆరేశాడు

ధర్మశాల: భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్లో రెండు సెంచరీలు సాధించిన స్మిత్.. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా శతకం నమోదు చేశాడు. 150 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ మార్కును చేరాడు.  ఒకవైపు ఆసీస్ వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం అత్యంత నిలకడగా ఆడుతూ సెంచరీ సాధించాడు.

 

టాస్ గెలిచిన ఆసీస్ ఆదిలోనే రెన్ షా(1) వికెట్ ను కోల్పోయింది. ఆ క్రమంలో డేవిడ్ వార్నర్ కు జతకలిసిన స్మిత్ వన్డే తరహాలో దూకుడును ప్రదర్శించాడు. 67 బంతుల్లోనే ఆరు ఫోర్లతో అర్ధ శతకం సాధించాడు. మరొకవైపు వార్నర్ కూడా స్మిత్ కు చక్కటి సహకారం అందివ్వడంతో ఆసీస్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఈ క్రమంలోనే వార్నర్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జోడి 134 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తరువాత వార్నర్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై షాన్ మార్ష్(4), హ్యాండ్సాంబ్(8), మ్యాక్స్ వెల్(8)లు పెవిలియన్ చేరారు. భారత జట్టులోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ రాణించడంతో ఆసీస్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరొకవైపు ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు