వారెవ్వా.. స్టీవ్‌ స్మిత్‌

6 Aug, 2019 14:18 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఒకవైపు ఇంగ్లండ్‌ అభిమానుల నుంచి ‘చీటర్‌-చీటర్‌’ అంటూ ఎగతాళి మాటలు వినిపించినా ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మొక్కవోని విశ్వాసంతో సెంచరీలతో చెలరేగిపోయాడు. యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టుతో తన టెస్టు రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్న స్మిత్‌.. ఆసీస్‌ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్మిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 142 పరుగులు చేశాడు.  ఫలితంగా 25వ టెస్టు సెంచరీ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా వేగవంతంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో ఆటగాడిగా స్మిత్‌ నిలిచాడు. సర్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 25వ టెస్టు సెంచరీ సాధించిన ఘనతను అందుకున్నాడు. అదే సమయంలో కోహ్లిని వెనక్కినెట్టాడు స్మిత్‌.

ఇదిలా ఉంచితే, ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నిం‍గ్స్‌ల్లో సెంచరీతో పాటు హాఫ్‌ సెంచరీ పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వస్‌ కల్లిస్‌ సరసన చేరిపోయాడు. ఇప్పటివరకూ ఒక టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో పాటు హాఫ్‌ సెంచరీలను కల్లిస్‌ తొమ్మిది సందర్భాల్లో చేశాడు. ఇప్పడు స్మిత్‌ సైతం కల్లిస్‌ రికార్డును చేరుకున్నాడు. ఇందుకు బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ వేదికైంది. ఈ జాబితాలో అలెస్టర్‌ కుక్‌(ఇంగ్లండ్‌) ఎనిమిది సందర్భాల్లో ఆ మార్కును చేరి రెండో స్థానంలో కొనసాగుతుండగా, అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా), విరాట్‌ కోహ్లి(భారత్‌), రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా), కుమార సంగక్కరా(శ్రీలంక), సచిన్‌ టెండూల్కర్‌( భారత్‌)లు ఏడేసి సార్లు ఆ ఫీట్‌ సాధించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. మరొక టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌ సెంచరీ, హాఫ్‌ సెంచరీలను సాధిస్తే కల్లిస్‌ అధిగమిస్తాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా