'సరైన సమయంలో అతడికి కెప్టెన్సీ'

17 Sep, 2015 19:05 IST|Sakshi
'సరైన సమయంలో అతడికి కెప్టెన్సీ'

సిడ్నీ : తన తర్వాత జట్టు బాధ్యతలు స్వీకరించిన స్టీవ్ స్మిత్ కెప్టెన్గా సక్సెస్ సాధిస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్లో టాపార్డర్ స్థానాలలో స్మిత్ రావడం అతడి ఆటతీరును దెబ్బతీయదన్నాడు. కెప్టెన్గా నిరూపించుకోవడానికి అతడికిదే మంచి తరుణమని క్లార్క్ పేర్కొన్నాడు. బంగ్లాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో జట్టులో చాలా మంది కొత్తవాళ్లకు అవకావం లభించింది. యాషెస్ సిరీస్ ఓటమి అనంతరం బ్రాడ్ హడిన్, క్రిస్ రోజర్స్, ర్యాన్ హ్యారిస్, షేన్ వాట్సన్ టెస్టులకు వీడ్కోలు పలికారు.

యాషెస్ సిరీస్లో భాగంగా స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ జట్టుపై లార్డ్స్ లో చేసిన 215 పరుగుల ఇన్నింగ్స్ అద్బుతమని ప్రశంసించాడు. బంగ్లా సిరీస్లో జట్టును మరింత ముందుకు నడిపిస్తాడని క్లార్క్ వ్యాఖ్యానించాడు. కెరీర్ లోనే స్మిత్ ఉన్నత దశలో ఉన్నప్పుడు అతని చేతికి పగ్గాలు రావడం సంతోషకర అంశమన్నాడు. యాషెస్ టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే టెస్టులకు క్లార్క్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు