స్మిత్ సెంచరీతో ఆసీస్‌కు ఊరట, స్కోరు: 326/6

13 Dec, 2013 17:18 IST|Sakshi
స్మిత్ సెంచరీతో ఆసీస్‌కు ఊరట, స్కోరు: 326/6

పెర్త్ : తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా, మూడో టెస్ట్ లోనూ తన లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ కు మధ్య శుక్రవారం జరిగిన మూడో టెస్ట్ తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్  తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 87 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అధ్బుతమైన ప్రదర్శనతో దూకుడుగా ఆడి 191 బంతుల్లో 13ఫోర్లు, 2 సిక్స్ లతో 103 పరుగులు చేశాడు. అప్పటికే కష్టాలో పడిన ఆసీస్ స్మిత్ దూకుడుతో తిరిగి పుంజుకుంది.

ఆసీస్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోజర్స్ 11 పరుగులకే చేతులెత్తెయడంతో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వార్నర్ 60 పరుగులు చేయడంతో ఆసీస్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఇంతలో స్వాన్ విసిరిన బంతిలో కార్ బెర్రీ క్యాచ్ పట్టడంతో వార్నర్ కూడా పెవెలియన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన వాట్సన్(18), క్లార్క్(24), వీరి పేలవ ప్రదర్శనతో ఆసీస్ పీకల్లోతు కష్టాలో పడింది. దీంతో ఆసీస్ పని అయిపోయిందనకున్న తరుణంలో స్మిత్ రాకతో ఆసీస్ లో మళ్లీ కొత్త ఉత్సాహం కనిపించింది. స్మిత్ వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీలను దాటించాడు. ఆసీస్ కెప్టెన్ బ్రాడ్ హద్దీన్(55) భాగస్వామ్యంతో స్మిత్ చెలరేగాడు. అండ్రసన్ క్యాచ్ తో హద్దీన్ కూడా వెనుతిరిగాడు. అప్పటికీ ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. కాగా, స్మిత్ 103, మిచ్చెల్ జాన్సన్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

మరిన్ని వార్తలు