హెడ్‌ లైన్స్‌ కాదు.. ఆర్టికల్‌ మొత్తం చదువు: స్టోక్స్‌

27 Mar, 2020 12:09 IST|Sakshi

లండన్‌:  ‘ నా తదుపరి కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఏదైనా ఉందంటే అది ఐపీఎలే. అందుకోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నా.  ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేశా’ అని ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ వాయిదా పడిన తరుణంలో ఆ లీగ్‌ జరగడం దాదాపు కష్టమే. ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ ఐపీఎల్‌ను వాయిదా వేసినా అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తేనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్‌ జరుగుతుందా..లేదా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా అందుకోసం సిద్ధం ఉన్నట్లు స్టోక్స్‌ తెలిపాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడనున్న స్టోక్స్‌ను 2018లో ఆ ఫ్రాంచైజీ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఒక అభిమాని మాత్రం స్టోక్స్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. నీ ఐపీఎల్‌ డబ్పులు కూడా లాక్‌డౌన్‌లో పడ్డాయ్‌. ఆ డబ్బుల్ని మరిచిపో. కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి కోసం ఆలోచించు’ అని విమర్శించాడు.  దీనికి స్టోక్స్‌ కు చిర్రెత్తుకొచ్చింది. (ఏమిరా చహల్‌.. మొన్న వీధిలో.. ఇప్పుడు ఇంట్లో!)

’హెడ్‌లైన్స్‌ చూసి ఏదో మాట్లాడకు.. మొత్తం ఆర్టికల్‌ చదవి మాట్లాడు’ అంటూ మండిపడ్డాడు.  ఈ క్రమంలోనే  తన అన్న మాటల్ని ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌ జరిగితే తాను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని మాత్రమే చెప్పానంటూ కౌంటర్‌ ఎటాక్‌ చేశాడు. ఐపీఎల్‌ వాయిదా పడ్డ  సమయానికి ఆరంభం కాదనేది ప్రస్తుత పరిస్థితిని బట్టి చెప్పవచ్చు. కానీ రెండు రోజుల క్రితం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ.. ఇంకా నాన్చుడి ధోరణే కనబరిచాడు. ‘ఈ సమయంలో ఏమీ చెప్పలేను. లీగ్‌ను వాయిదా వేసినప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా లేదు. ఏమీ మారలేదు. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు’ అని అన్నాడు.  ఇంకా గంగూలీ ఆశాభావంతో ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఐపీఎల్‌ జరగడం కష్టం.ఈ నేపథ్యంలో ప్లాన్‌ ‘బి’ని బోర్డు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జూలై-సెప్టెంబరు మధ్య నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై బీసీసీఐ సమాలోచన చేస్తోంది. 

మరిన్ని వార్తలు