‘నరకం అంటే ఏమిటో చూశా’

28 Mar, 2020 12:33 IST|Sakshi

రోమ్ప్ర‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా,  ఆ మరణాల సంఖ్య ఇటలీలో తీవ్రంగా ఉంది. ఇప్పటివరకూ ఇటలీలో 9వేలకు మందిపైగా ప్రాణాలు కోల్పోగా, ఆ దేశ ప్రొషెషనల్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్లలో ఒకటైన జువెన్‌టస్‌ జట్టు సభ్యుడు, అర్జెంటీనా ఆటగాడు పౌలో డైబలా సైతం కరోనాతో పోరాటం చేసి బయటపడ్డాడు. ఈ క్లబ్‌ తరఫున ఆడే ఆటగాళ్లలో డానియెల్‌ రుగాని, బ్లాసి మాటుడిలో కరోనా వైరస్‌ బారిన పడగా,  అందులో డైబాలా ఒకడు. దీనిలో భాగంగా కరోనా వైరస్‌ తనను ఎంతలా బాధించిందనే అనుభవాలను డైబలా పంచుకున్నాడు.  

‘నేను ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నా. కరోనా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చాలా రోజుల క్రితం నా ఆరోగ్యం బాలేదు. నడవడం చాలా కష్టమనిపించేది. ఐదు నిమిషాలు నడిచిన తర్వాత తప్పకుండా ఆగాల్సి వచ్చేది. ఊపిరి తీసుకోలేకపోయే వాడిని.  నరకం అంటే ఏమిటో చూశా. ప్రస్తుతం కాస్త నడవ కలుగుతున్నా. గత కొన్నిరోజుల క్రితం నడిస్తే షేక్‌ అయ్యే వాడిని. ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడానికి యత్నిస్తున్నా. ప్రస్తుతం బాగానే ఉన్నా. కాకపోతే కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు.  కరోనా బారిన పడిన నా కాబోయే భాగస్వామి ఒరియానా కూడా కోలుకుంటుంది’ అని డైబలా చెప్పుకొచ్చాడు. 

ఇటీవల దక్షిణాఫ్రికా దిగ్గజ స్విమ్మర్‌ కామెరూన్‌ వాన్‌ డెర్‌ బర్గ్‌.. కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నాడు. ఆ వైరస్‌తో ఎంతటి నరకం అనుభవించాడో వివరించాడు.  జీవితంలో చూసిన వైరస్‌ల పరంగా చూస్తే ఇది భరించలేని ఒక చెత్త వైరస్‌ అని పేర్కొన్నాడు. (ఇది భరించలేని చెత్త వైరస్‌)

మరిన్ని వార్తలు