రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా..

22 Mar, 2018 12:43 IST|Sakshi
స్టువార్ట్‌ బ్రాడ్‌ (ఫైల్‌ ఫోటో)

ఆక్లాండ్‌ : ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువార్ట్‌ బ్రాడ్‌ అరుదైన మైలురాయిని సొంతం​ చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో నాలుగు వందల వికెట్లను సాధించిన క్లబ్‌లో బ్రాడ్‌ చేరిపోయాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డే–నైట్‌ టెస్టు మ్యాచ్‌లో కివీస్‌ బ్యాట్‌మెన్‌ లాథమ్‌ వికెట్‌ సాధించడంతో  బ్రాడ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. 115 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. 2007లో శ్రీలంకపై టెస్ట్‌ ఆరంగ్రేటం చేసిన బ్రాడ్‌,అతి కొద్ది కాలంలోనే ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ ఆయ్యాడు.

ఇంగ్లండ్‌ తరుపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన వారిలో అండర్సన్‌(524) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇంకో 17 వికెట్లు సాధిస్తే టీమిండియా బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ రికార్డును సమం చేస్తాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌటైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ పేసర్‌ బౌల్ట్‌ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు.

మరిన్ని వార్తలు