క్రీడల్లోనూ రాణించాలి: జ్వాల

4 Oct, 2016 11:35 IST|Sakshi

హైదరాబాద్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అన్నారు. కష్టపడితే క్రీడలతోనూ భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో  కేంద్రీయ విద్యాలయాల జాతీయ స్పోర్‌‌ట్సమీట్ ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌ను సైబ రాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీని వాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుత్తాజ్వాల మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో  క్రీడలకు సముచిత ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు.

 

విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహిస్తే వారి ప్రతిభను సానబెట్టే అవకాశాలుంటాయని సైబ రాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో హాకీ, బాస్కెట్‌బాల్, రోప్ స్కేటింగ్,  కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్, స్కేటింగ్ తదితర  9 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తారు. సోమవారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో తెలంగాణ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనాలు , పులివేషాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.


 

మరిన్ని వార్తలు