స్తుతిశ్రీకి 4 స్వర్ణాలు

3 Aug, 2019 10:05 IST|Sakshi

సీఐఎస్‌సీఈ రీజినల్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: సీఐఎస్‌సీఈ రీజినల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా జరిగిన బాలికల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ (కింగ్‌కోఠి) స్విమ్మర్‌ పి. స్తుతిశ్రీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో శుక్రవారం జరిగిన పోటీల్లో ఆమె 4 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అండర్‌–19 బాలికల 100మీ. ఫ్రీస్టయిల్, 200మీ. ఫ్రీస్టయిల్, 100మీ. బ్రెస్ట్‌ స్ట్రోక్, 200మీ. బ్రెస్ట్‌ స్ట్రోక్‌ ఈవెంట్‌లలో స్తుతి విజేతగా నిలిచింది. వీటితో పాటు ఆమె వ్యక్తిగత విభాగంలో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆమెతో పాటు ఆర్‌. పూర్వి పతకాల పంట పండించింది. 400మీ. ఫ్రీస్టయిల్, 200మీ. బటర్‌ఫ్లయ్, 50మీ. బటర్‌ఫ్లయ్‌ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచి 3 పసిడి పతకాలను గెలుచుకున్న పూర్వి... 200మీ. ఫ్రీస్టయిల్‌లో కాంస్యాన్ని అందుకుంది. కావ్యప్రియ కాంస్యం, రజతం... అయేషా అజీమ్‌ కాంస్యం... కావ్య యశస్విని స్వర్ణం, రజతం... సారా అజీమ్, నిధి, అవని తలా ఓ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. అండర్‌–19 బాలికల విభాగంలో సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ (కింగ్‌కోఠి) జట్టుకు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ లభించింది.  

అండర్‌–14 బాలికల విజేతల వివరాలు
100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌: 1. యుక్త (రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌), 2. చంద్రముక్త (లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌), 3. క్రాంతి గుప్తా (అరబిందో).
100మీ. బ్యాక్‌స్ట్రోక్‌: 1. రాబియా అరస్తు (నాసర్‌స్కూల్‌), 2. తన్వీ (ఇండియన్‌ బ్లోసమ్‌), 3. డింపుల్‌ (అభ్యాస).
100మీ. ఫ్రీస్టయిల్‌: 1. దిశా కుమారి (ఫ్యూచర్‌ కిడ్స్‌).
50మీ. ఫ్రీస్టయిల్‌: 1. దిశా కుమారి (ఫ్యూచర్‌ కిడ్స్‌).

మరిన్ని వార్తలు