800 మీటర్ల విజేత సుచిత్ర

24 Oct, 2017 10:52 IST|Sakshi
800 మీటర్ల విజేతలతో శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజి అథ్లెటిక్స్‌ టోర్నమెంట్‌లో సెయింట్‌ ఆన్స్‌కు చెందిన సుచిత్ర సత్తా చాటింది. గచ్చిబౌలిలో సోమవారం జరిగిన బాలికల 800 మీటర్ల పరుగు ఈవెంట్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సుచిత్ర లక్ష్యదూరాన్ని 2ని. 21.03 సెకన్లలో పూర్తి చేసింది. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజికి చెందిన ప్రత్యూష పరుగును 2ని. 22.00 సెకన్లలో పూర్తి చేసి రజతాన్ని గెలుచుకోగా, సెయింట్‌ పాయిస్‌ అథ్లెట్‌ బి. కావ్య (2ని. 45.7సె.) కాంస్యాన్ని సాధించింది. బాలుర విభాగంలో ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజికి చెందిన వి. శ్రీనివాస్‌ పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. అతను పరుగును 2ని. 02.07 సెకన్లలో పూర్తిచేశాడు. హాజి గౌస్‌ వ్యాయామ విద్య కాలేజికి చెందిన వి. మారుతి (2ని. 05.06సె.) రజతాన్ని, భవన్స్‌ న్యూ సైన్స్‌ కాలేజికి చెందిన పి. గోపాల్‌ (2ని. 05.09సె.) కాంస్యాన్ని సాధించారు. ఈ టోర్నీని ‘శాట్స్‌’ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు:

మహిళలు: షాట్‌పుట్‌: 1. కె. నాగ అనూష, 2. మానస, 3. జె. సంధ్య. 200 మీ. పరుగు: 1. జి. నిత్య, 2. పి.సుశ్మితా రాణి.  400 మీ. పరుగు: 1. విశాలాక్షి, 2. హఫీజా బేగం, 3. చందన.   5000 మీ.: 1. బి. సంధ్య, 2. ఆర్‌. కలైవాణి, 3. మేఘన.  డిస్కస్‌ త్రో: 1. మానస, 2. అంబిక, 3. యాస్మిన్‌.   4/400మీ. రిలే: 1. సెయింట్‌ ఆన్స్, 2. నిజాం కాలేజి, 3. జీసీపీఈ.   

పురుషులు: 200 మీ: 1. ఆమ్లాన్‌ బొర్గొహెన్, 2. పి. యశ్వంత్‌ సాయి, 3. జె. శ్రవణ్‌.        షాట్‌పుట్‌: 1. అంకిత్, 2. సన్నీ, 3. పీఎన్‌ సాయి కుమార్‌.   లాంగ్‌జంప్‌: 1. పి. శ్రీకాంత్, 2. సీహెచ్‌ వినోద్‌ కుమార్, 3. బి. రాము.  400 మీ. హర్డిల్స్‌: 1. పి. గోపాల్, 2. కె. అజయ్‌ కుమార్, 3. ఎం. మధు.   5000 మీ. : 1. బి. రమేశ్, 2. కె. నరేశ్, 3. సయ్యద్‌ షాబాజ్‌ అలీ.  హైజంప్‌: 1. ఆర్‌. ప్రకాశ్, 2. పి. శ్రీకాంత్, 3. అక్షయ్‌.   4/400మీ. రిలే: 1. నిజాం కాలేజి, 2. జీసీపీఈ, 3. ఓయూ సైన్స్‌ కాలేజి (సైఫాబాద్‌).

మరిన్ని వార్తలు