ఫైనల్లో సుమిత్‌ నాగల్‌

15 Sep, 2019 09:53 IST|Sakshi

ఏటీపీ టెన్నిస్‌ టోర్నీ

బోస్నియా: ఏటీపీ టూర్‌ బంజా లుకా చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత ఆటగాడు సుమిత్‌ నాగల్‌ ప్రవేశించాడు. సెమీస్‌లో సుమిత్‌ 7–6 (7/1), 6–2తో ఫిలిప్‌ హొరంస్కీ (స్లొవేకియా)పై విజయం సాధించాడు. షాంగై చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో ఆడుతున్న మరో భారత ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. అతను 6–7 (7/9), 4–6తో యసుటక ఉచియామ (జపాన్‌) చేతిలో ఓడాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా