కశ్యప్‌ ఖాతాలో కాంస్యం

12 Dec, 2016 14:26 IST|Sakshi
కశ్యప్‌ ఖాతాలో కాంస్యం

జెజు (కొరియా): ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ ఆ అడ్డంకిని దాటలేకపోయాడు. కొరియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్యాన్ని సాధించాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సన్‌ వాన్‌ హో (దక్షిణ కొరియా)తో జరిగిన సింగిల్స్‌ సెమీఫైనల్లో కశ్యప్‌ 21–23, 16–21తో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో ఓడిన కశ్యప్‌కు 1,740 డాలర్ల (రూ. లక్షా 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

మరిన్ని వార్తలు