బౌలర్లను ఎంత పొగిడినా తక్కువే

6 Sep, 2018 01:06 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

మంచి అవకాశాలను వృథా చేసుకునే పాత కథే పునరావృతమైంది. 1–2తో వెనుకబడినా కూడా సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించగలిగే సువర్ణావకాశాన్ని భారత్‌ చేజార్చుకుంది. దక్షిణాఫ్రికాలోలాగే భారత బౌలర్లు ప్రత్యర్థిని పడ గొట్టగలిగినా బ్యాటింగ్‌ వైఫల్యం జట్టును ఓడించింది. రెండు పర్యటనల్లోనూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రమే ఏదో కొత్త ప్రపంచంలో బ్యాటింగ్‌ చేస్తున్నట్లు భిన్నంగా కనిపించాడు. దురదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికా సిరీస్‌ తరహాలోనే ఇతర ఆటగాళ్లనుంచి కోహ్లికి తగిన సహకారం లభించలేదు.

అతను ఔట్‌ కాగానే మిగతా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకముక్కల్లా కూలిపోయింది. స్వింగ్‌ బంతులను ఎదుర్కొనేందుకు తగిన సాధన చేయాల్సిన జట్టు మొండిగా వ్యవహరించి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను కాదనుకుంది. దీనికి తోడు మొయిన్‌ అలీకి లొంగిపోవడం మింగుడుపడని వ్యవహారం. తమ ప్రాణం పెట్టి బౌలింగ్‌ చేసిన మన పేసర్లను ఎంత పొగిడినా తక్కువే. ఇషాంత్, షమీ, బుమ్రాలు ఎప్పుడు బౌలింగ్‌కు వచ్చినా బంతితో అద్భుతాలు చేస్తూ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఒక ఆటాడుకున్నారు. ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమే కానీ వాతావరణం చల్లగా మారిపోతే మాత్రం కష్టం.  

మరిన్ని వార్తలు