నరైన్, పొలార్డ్‌లకు పిలుపు

24 Jul, 2019 07:47 IST|Sakshi

భారత్‌తో టి20 సిరీస్‌కు విండీస్‌ జట్టు ప్రకటన  

సెయింట్‌జాన్స్‌: చాలాకాలం తర్వాత ‘మిస్టరీ స్పిన్నర్‌’ సునీల్‌ నరైన్‌ వెస్టిండీస్‌ టి20 జట్టుకు ఎంపికయ్యాడు. భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు గాను తొలి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ప్రకటించిన జట్టులో అతడితో పాటు ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌కు చోటుదక్కింది. నరైన్‌ విండీస్‌ తరఫున రెండేళ్ల క్రితం చివరి టి20 ఆడాడు. మొత్తం 14 మంది సభ్యుల జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఆంథోని బ్రాంబెల్‌ ఒక్కడే కొత్తముఖం.  ఆల్‌రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యం వహిస్తాడు. గాయంతో ప్రపంచ కప్‌ మధ్యలో తప్పుకొన్న మరో స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ అందుబాటులోకి రాగా... విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ అందుబాటులో ఉండనని ప్రకటించాడు. అతడి స్థానంలో ఎడంచేతి వాటం ఓపెనర్‌ జాన్‌ క్యాంప్‌బెల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడు. వచ్చే ఏడాది జరుగనున్న టి20 ప్రపంచ కప్‌ను నిలబెట్టుకునే ప్రణాళికల్లో భాగంగా సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు వెస్టిండీస్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రాబర్ట్‌ హేన్స్‌ తెలిపారు. సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20లు ఆగస్ట్‌ 3, 4 తేదీల్లో ఫ్లోరిడా (అమెరికా)లోని లాడర్‌హిల్‌లో జరుగుతాయి. ఆగస్ట్‌ 6న మూడో టి20కి గయానా ఆతిథ్యం ఇవ్వనుంది.

తొలి రెండు టి20లకు విండీస్‌ జట్టు: కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), సునీల్‌ నరైన్, కీమో పాల్, ఖారీ పియర్, కీరన్‌ పొలార్డ్, నికోలస్‌ పూరన్, అంథోని బ్రాంబెల్‌ (వికెట్‌ కీపర్లు), రోవ్‌మన్‌ పావెల్, ఆండ్రీ రసెల్, ఒషాన్‌ థామస్, జాన్‌ క్యాంప్‌బెల్, షెల్డన్‌ కాట్రెల్, షిమ్రన్‌ హెట్‌మైర్, ఎవిన్‌ లూయిస్‌.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మిఠాయిలు, మసాలాలు వద్దే వద్దు..

ఐర్లాండ్‌కు సువర్ణావకాశం

క్వార్టర్స్‌లో హుసాముద్దీన్‌

సాయిప్రణీత్‌  శుభారంభం 

వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!

నాకొద్దు.. అతడికే ఇవ్వండి: స్టోక్స్‌

టెస్ట్‌ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!

అలిసన్‌ స్టెప్పేస్తే.. సానియా ఫిదా

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌

నేను సెలక్ట్‌ అవుతాననే అనుకున్నా: శుబ్‌మన్‌

టీమిండియా కోచ్‌ రేసులో జయవర్థనే..!

అదే టర్నింగ్‌ పాయింట్‌: కృనాల్‌

గేల్‌ దూరం.. పొలార్డ్‌కు చోటు

లక్ష్యం ఒలింపిక్స్‌

పేస్‌-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!

జాడ లేని భారత టీటీ కోచ్‌!

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్‌ నియామకాలు

ఆ మ్యాచ్‌ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై

మనోళ్ల సత్తాకు పరీక్ష 

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

శ్రీజ తీన్‌మార్‌

టోక్యో ఎంత దూరం?

యు ముంబా చిత్తుచిత్తుగా

బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌