నరైన్ 'ఓపెనింగ్' సక్సెస్

13 Apr, 2017 22:46 IST|Sakshi
నరైన్ 'ఓపెనింగ్' సక్సెస్

కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో గురువారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేసిన ఓపెనింగ్ ప్రయోగం ఫలించింది. కోల్ కతా విధ్వంసకర ఓపెనర్ క్రిస్ లిన్ గాయం కారణంగా ప్రస్తుతం గైర్హాజరీలో ఉండటంతో అతని స్థానంలో సునీల్ నరైన్ ఓపెనింగ్ కు పంపారు.  చివరి వరుస ఆటగాడైన నరైన్.. ఈ రోజు మ్యాచ్ లో గంభీర్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు.

కింగ్స్ బౌలర్ సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని ఫోర్ గా కొట్టి తన ఉద్దేశాన్ని చెప్పిన నరైన్.. ఓ చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సరతో 37 పరుగులు చేశాడు.  ముఖ్యంగా వరుణ్ అరోన్ వేసిన ఆరో ఓవర్ లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లగా మలచిని నరైన్.. ఆ తరువాత బంతిని ఫోర్ గా కొట్టాడు. అయితే ఆ మరుసటి బంతికి మరో హిట్ చేసే యత్నంలో నరైన్ అవుటయ్యాడు. పంజాబ్  విసిరిన 171 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతాకు నరైన్ కొట్టిన ఈ 37 పరుగులు కచ్చితంగా విలువైనవిగానే చెప్సొచ్చు. తొలుత నరైన్ ఓపెనింగ్ రావడం చూసి  ఆశ్చర్యానికి లోనైన కేకేఆర్ అభిమానులు అతని ఆట చూసిన తరువాత శభాష్ అనుకున్నారు.

మరిన్ని వార్తలు