గేల్‌ ఛాలెంజ్‌కు.. సన్నీలియోన్‌..సై

19 Jul, 2017 11:53 IST|Sakshi
గేల్‌ ఛాలెంజ్‌కు.. సన్నీలియోన్‌..సై
న్యూఢిల్లీ: మైదానంలో తన ఆటతోనే కాకుండా డ్యాన్స్ తో అలరించే వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేల్‌ సోషల్‌ మీడియాలో అభిమానులకు ఓ ఛాలెంజ్‌ విసిరాడు. ‘లైలా మై లైలా’ బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌ చేసిన గేల్‌ ఆ వీడియోను ఇన్‌స్ట్రాగ్రమ్‌లో పోస్టు చేశాడు. దీనికి క్యాప్షన్‌గా తన కంటే బాగా డ్యాన్స్‌ చేసి నామినేషన్‌లు పంపించాలని అభిమానులను కోరాడు. ఈ ఛాలెంజ్‌లో నెగ్గిన విజేతలకు 5000 యూఎస్‌ డాలర్లు బహుమనంగా ఇస్తానన్నాడు.
 
ఈ జమైకన్‌ స్టార్‌ ఛాలెంజ్‌ను బాలీవుడ్‌ భామ సన్నీలియోన్‌ స్వీకరించింది. ఇటీవల నటించిన బాలీవుడ్‌ సినిమాలోని ఓ నృత్యాన్ని  నామినేషన్‌గా పంపించింది. ‘ఏ గేల్‌ ఇది నా నామినేషన్‌ అని’ ట్వీట్‌ చేసింది. వెంటనే గేల్‌ ఇప్పుడే నీ డ్యాన్స్‌ చూశా.. అని సమాధానం ఇచ్చాడు. ఇంకో వారం రోజుల్లో గేల్‌ విజేతను ప్రకటించనున్నాడు. మరి సన్నీ డ్యాన్స్‌ జమైకన్‌కు నచ్చిందో లేదో మరి.. 
 

 

మరిన్ని వార్తలు