సురేఖ–అభిషేక్‌ జంటకు రజతం 

30 Sep, 2018 00:10 IST|Sakshi

సామ్సన్‌ (టర్కీ): ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో రజత పతకం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ (భారత్‌) ద్వయం 152–159తో యాసిమ్‌ బోస్టాన్‌–దెమిర్‌ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీ చేతిలో ఓడిపోయింది.

ఈ సీజన్‌లో జరిగిన నాలుగు వరల్డ్‌ కప్‌ టోర్నీలలో కాంస్యాలు సాధించినందుకు సురేఖ–అభిషేక్‌ ద్వయం సీజన్‌ ముగింపు టోర్నీకి అర్హత సాధించింది.  మరోవైపు పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ 149–147తో కిమ్‌ జాంగ్‌హో (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు.    

మరిన్ని వార్తలు