100 మీ. పరుగు విజేతలు సురేశ్, మహేశ్‌

10 Sep, 2018 10:01 IST|Sakshi

 హైదరాబాద్‌ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ మీట్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఓపెన్‌ స్ప్రింట్స్, జంప్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో టి. సురేశ్, కె. మహేశ్‌ స్వర్ణాలను సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్‌– 14 బాలుర 100 మీ. పరుగును సురేశ్‌ 12.01 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. బి. భానుప్రసాద్‌ (12.07 సెకన్లు) రజతాన్ని గెలుచుకోగా... స్వేజన్‌ (12.61 సెకన్లు) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. అండర్‌–16 బాలుర 100 మీ. పరుగులో మహేశ్‌ 11.52 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకాన్ని సాధించాడు. జి. గణేశ్‌ 11.95 సెకన్లతో రజతాన్ని, మీనల్‌ 11.96 సెకన్లతో కాంస్యాన్ని గెలుచుకున్నారు.

లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో హెచ్‌. మురళీ (5.40 మీ.), ఎం. చంద్ర కుమార్‌ (5.33 మీ.), జి. అజయ్‌ (5.16 మీ.) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్‌ నాగపురి రమేశ్, తెలంగాణ అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి ప్రొఫెసర్‌ కె. రంగారావు తదితరులు పాల్గొన్నారు.  

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు


 అండర్‌–10 బాలుర 60 మీ. పరుగు: 1. ఎం. రిషికేశ్‌ (జెనెసిస్‌ స్కూల్‌), 2. పార్థ్‌ (గార్డియన్‌), 3. ఎం. రిషికేశ్‌ (భారతీయ విద్యాభవన్‌).
 అండర్‌–12 బాలుర 80 మీ. పరుగు: 1. జె. అనిల్‌ (వరంగల్‌), 2. వి. గోపాల్‌ (బీసీడబ్ల్యూ), 3. కె. ఆనంద్‌ (బీసీడబ్ల్యూ).
 లాంగ్‌జంప్‌: 1. జి. లక్ష్మణ్‌ (ఎల్బీహెచ్‌ఎస్‌), 2. జె. అనిల్‌ (జీపీహెచ్‌ఎస్‌), 3. కె. ఆనంద్‌ (ఎంజేపీ).  
 అండర్‌–16 బాలుర లాంగ్‌జంప్‌: 1. వి. స్వామి (జీజేసీ), 2. మొహమ్మద్‌ మన్సూరి (ఏఈసీఎస్‌), 3. వాసు (హెచ్‌పీఎస్‌).  
 పురుషుల 100 మీ. పరుగు: 1. కె. రాజు (రంగారెడ్డి), 2. అమ్లాన్‌ (రంగారెడ్డి), 3. షర్మిన్‌ (హైదరాబాద్‌).  
 లాంగ్‌జంప్‌: 1. రాజు (రంగారెడ్డి), 2. సి. ఫణీంద్రనాథ్‌ (రంగారెడ్డి), 3. అమ్లాన (రంగారెడ్డి).  
 అండర్‌–10 బాలికల 60 మీ. పరుగు: 1. విభా రావు (చిరెక్‌), 2. రాజశ్రీ (ఎస్‌డబ్ల్యూఎస్‌), 3. సంజన (చిరెక్‌).  
 లాంగ్‌జంప్‌: 1. ఎస్‌. రాజశ్రీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌), 2. ప్రీతిక (హైదరాబాద్‌), 3. జె. పండు (వరంగల్‌).  
 అండర్‌–12 బాలికల 80 మీ. పరుగు: 1. శ్రీయాని (ఇంటర్నేషనల్‌ స్కూల్‌), 2. సహన (చిరెక్‌), 3. ఎం. హర్ష వర్ధిని (ఏఈసీఎస్‌).  
 అండర్‌–14 బాలికల 100మీ. పరుగు: 1. ఆర్‌. మేఘన (సెయింట్‌ గాబ్రియెల్‌), 2. నిఖిల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌), 3. కృతి.
 లాంగ్‌జంప్‌: 1. కె. నిఖిల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈటీఎస్‌), 2. అంజలి (హైదరాబాద్‌), 3. అదితి (సంగారెడ్డి).  
 అండర్‌–16 బాలికల 100 మీ. పరుగు: 1. రియా గ్రేస్‌ (సెయింట్‌ ఆన్స్‌), 2. ఎం. అక్షయ, 3. సంధ్య (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌).  
 400 మీ. పరుగు: 1. రియాగ్రేస్‌ (సెయింట్‌ఆన్స్‌), 2. పి. వసంత (బీహెచ్‌ఈఎల్‌), 3. శర్వాణి (చిరెక్‌).  
 మహిళల 100 మీ. పరుగు: 1. జి. నిత్య (హైదరాబాద్‌), 2. సోనమ్‌ (హైదరాబాద్‌), 3. అచ్యుత కుమారి (హైదరాబాద్‌).  
 400 మీ. పరుగు: 1. జి.నిత్య (హైదరాబాద్‌), 2. కె. రమాదేవి, 3. అనురాఘ.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విరాట్‌ కోహ్లి సరికొత్త రికార్డు

పాక్‌ విజయం: స్టెప్పులేసిన భారత ఫ్యాన్స్‌

రాహుల్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌

అలాగే జరగాలని ఏమీ లేదు: పాక్‌ కెప్టెన్‌

ఇదేం డీఆర్‌ఎస్‌రా నాయనా!

‘ఈ విజయం.. అద్భుతం’

మరో విజయమే లక్ష్యంగా టీమిండియా..

పంత్‌, శంకర్‌ కాదు.. మరెవరు?

‘లక్కీ’ జెర్సీతో మిగతా మ్యాచ్‌లు!

మరో అకాడమీ కోసం గోపీచంద్‌ భూమిపూజ

క్రియేటర్స్‌ తైక్వాండో క్లబ్‌కు 5 పతకాలు

ధోని రికార్డుకు రోహిత్‌ ఎసరు!

జైత్రయాత్ర కొనసాగాలని...

పాక్‌ రేసులోకొచ్చింది

కోహ్లితో ఎలా​ పోల్చుతారు?

‘టీమిండియాతోనే నా చివరి మ్యాచ్‌’

ఇప్పటికీ ఇంగ్లండ్‌ ఫేవరెటే: ఆసీస్‌ బౌలర్‌

పాక్‌ ఛేదిస్తుందా.. చతికిలపడుతుందా?

ఆస్ట్రేలియా మూడో ఆటగాడిగా..

గుర్తుపెట్టుకోండి.. అతడే ప్రపంచకప్‌ హీరో

విజృంభించిన ఆఫ్రిది‌.. విలవిల్లాడుతున్న కివీస్‌

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు

మరో రికార్డుకు చేరువలో కోహ్లి

‘ఇది మా ప్రపంచకప్‌.. వెనక్కి తగ్గే ముచ్చటే లేదు’

ఇంగ్లండ్‌కు ఛేజింగ్‌ చేతకాదు

క్రికెట్‌ చరిత్రలోనే అదో అద్భుతం!

భారత్‌ను ఓడించగలం

కివీస్‌ను పాక్‌ ఆపేనా?

ఐఓఏ ఏకపక్ష నిర్ణయం తీసుకోదు

ఆసీస్‌ విలాసం ఇంగ్లండ్‌ విలాపం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నీరు మున్నీరైన కృష్ణ

చిరు స్పీడు మామూలుగా లేదు

విజయ నిర్మల మృతికి ‘ఆటా’ సంతాపం

నల్లగా ఉంటే ఏమవుతుంది?

నేను బాగానే ఉన్నా: అనుష్క

శేఖర్ కమ్ముల కొత్త సినిమా ప్రారంభం