ఇంటివాడు కానున్న రైనా

17 Mar, 2015 11:01 IST|Sakshi
ఇంటివాడు కానున్న రైనా

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, మీరట్  సమీపంలోని బారుట్‌కు చెందిన ప్రియాంక చౌదరిని అతను వివాహమాడనున్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 3న ఢిల్లీలో ఈ పెళ్లి జరుగుతుంది. ఏప్రిల్ 8న రిసెప్షన్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రియాంక నెదర్లాండ్స్‌లో బ్యాంకర్‌గా పని చేస్తోంది. వీరిద్దరి కుటుంబాలకు సుదీర్ఘ కాలంగా సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి తండ్రులు మురాద్‌నగర్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో కలిసి పని చేశారు. పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ ‘రోకా’ వేడుకను ఈ నెల 12న జరిపిన తర్వాత రైనా కుటుంబ సభ్యులు పెళ్లి విషయాన్ని ధ్రువీకరించారు.

>
మరిన్ని వార్తలు