చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి ధోని.. మరి రైనా?

14 Nov, 2017 21:34 IST|Sakshi

చెన్నై జట్టులోకి ధోని, డూప్లెసిస్‌, అశ్విన్‌

సాక్షి, చెన్నై: ఫిక్సింగ్‌ వివాదం ఆరోపణలతో రెండేళ్లు నిషేదం ఎదుర్కోన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఐపీఎల్‌-11 సీజన్‌లో పునరాగమనం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ జట్లు తమ ప్లేయర్లనే వెనక్కు తీసుకోవాడానికి మొగ్గు చూపుతున్నాయి. రైజింగ్‌ పుణే, గుజరాత్‌ లయన్స్‌లో ఆడిన చెన్నై, రాజస్థాన్‌ ప్లేయర్లు రిటెన్షన్‌ పాలసీలో భాగంగా తిరిగి వారి జట్లలోకి వెళ్లేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ విషయం త్వరలో కౌన్సిల్‌ నుంచే ప్రకటన వెలవడనుంది. దీనిలో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లులోకి మహేంద్రసింగ్‌ ధోని, రవిచంద్రన్‌ అశ్విన్‌, డుప్లెసిస్‌లు పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది.  అయితే చెన్నై మాజీ ప్లేయర్‌ సురేశ్‌ రైనాకు మాత్రం తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. చెన్నై జట్టు ఈ ముగ్గురు ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలనే కృతనిశ్చయంతో ఉందని ఓ చెన్నై దినపత్రిక పేర్కొంది.

అయితే తొలి 8 సీజన్లో చెన్నై తరుపున ఆకట్టుకున్న రైనాపై చెన్నైటీమ్‌ యాజమాన్యం ఆసక్తి చూపడం లేదని ప్రచురించింది. ఇక 11 ఐపీఎల్‌ సీజన్‌ను కొత్త సెట్‌తో నిర్హహించాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో 500 మంది ప్లేయర్లను వేలంలోకి అందుబాటులో ఉండనున్నారు. గవర్నింగ్‌ కౌన్సిల్‌ నియమ నిబంధనలు రూపోందించే వరకు జట్లు తమ వ్యూహాలను రచించలేవు. నవంబర్‌ 21న ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ విధివిధానాలను ఖరారు చేయనుంది.

పుకార్లు నమ్మొద్దు...
చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి సురేశ్‌ రావడం లేదని ఆన్‌లైన్‌లో వచ్చె పుకార్లు నమ్మొద్దని ఆ జట్టు అధికారిక ట్విట్టర్‌లో అభిమానులను కోరింది. ‘చిన్న తలా తిరిగి జట్టులోకి రావడం లేదని ఆన్‌లైన్‌లో పుకార్లు వస్తున్నాయని, ఇవి నమ్మొద్దని, జట్టు తిరిగి గౌరవం పొందడానికి ప్రయత్నిస్తున్నాం.’అని ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు