అతడు యువీ, సెహ్వాగ్‌ల తరహా క్రికెటర్‌: రైనా

28 Apr, 2020 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ప్రశంసలు కురిపించాడు. రిషభ్‌ పంత్‌ ఒక అసాధారణ క్రికెటర్‌ అంటూ కొనియాడాడు. భారత క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ల మాదిరి క్రికెట్‌ అని ప్రశంసించాడు. టీమిండియా స్సిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో ముచ్చటించిన క్రమంలో రిషభ్‌ ప్రస్తావన వచ్చింది.ఈ క్రమంలో రైనా మాట్లాడుతూ.. నా దృష్టిలో రిషబ్ పంత్ ఒక టాప్‌ క్రికెటర్‌. అసాధారణ బ్యాటింగ్‌ అతని సొంతం. రైనా మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు అతని బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తా. యువరాజ్‌, సెహ్వాగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ తరహా క్రికెటర్‌. వీరి తరహాలోనే ప్రత్యర్థి బౌలర్లపై పంత్‌ చేసే డామినేషన్‌ బాగుంటుంది’ అని రైనా పేర్కొన్నాడు. (అదొక చెత్త ప్రతిపాదన: వకార్‌ యూనిస్‌)

ప్రస్తుతం రిషభ్‌ పంత్‌ క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. రిషభ్‌ అరంగేట్రంలో అదరగొట్టినా ఆ తర్వాత అతనిలో దూకుడు తగ్గింది. అదే సమయంలో పంత్‌కు గాయం కావడం, కేఎల్‌ రాహుల్‌కు బాధ్యతలు అప్పచెప్పారు. ఆ అవకాశాన్ని రాహుల్‌ వినియోగించుకోవడంతో పంత్‌ ఊసే లేకుండా పోయింది టీమిండియా మేనేజ్‌మెంట్‌కు. పంత్‌కు ఏ క్షణంలో గాయమైందో కానీ అది అతని కెరీర్‌నే డైలమాలో పడేసింది. రాహుల్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాణించడంతో ఎదురులేకుండా పోయింది. పంత్‌ ఒక టాలెంటెడ్‌ క్రికెటర్‌ అని అతనికి వరుసగా అవకాశాలు ఇస్తే తప్పేముందని చెప్పిన జట్టులోని కొందరు పెద్దలు.. ఇప్పుడు అతని ఉంటే ఎంతా.. లేకపోతే ఎంతా అనే పరిస్థితికి వచ్చేశారు. ప్రస్తుత జట్టులో పంత్ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు ఇస్తున్నారు. ఐపీఎల్‌-13వ సీజన్‌తో గాడిలో పడాలని పంత్‌ భావించినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ జరగడం అనుమానంగా మారింది. ఈ తరుణంలో పంత్‌కు అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టొచ్చు. (నాకు సచిన్‌ వార్నింగ్‌ ఇచ్చాడు..: గంగూలీ)

మరిన్ని వార్తలు