అఫ్రిది వ్యాఖ్యలకు రైనా స్ట్రాంగ్‌ కౌంటర్

19 May, 2020 08:40 IST|Sakshi

హైదరాబాద్‌: ఓ వైపు ప్రపంచమంతా మహమ్మారి కరోనా వైరస్‌ను అరికట్టడానికి అవిశ్రాంతంగా పోరాడుతుంటే పాకిస్తాన్‌ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో భారత్‌పై తన అక్కసును వెల్లగక్కుతోంది. తాజాగా కశ్మీర్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాక్‌ మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆఫ్రిదిపై భారత క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడి వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. ఇప్పటికే గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లు ఆఫ్రిది వ్యాఖ్యలను తప్పుపట్టగా.. తాజాగా సురేష్‌ రైనా సైతం గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు.

‘ఆఫ్రిది కశ్మీర్‌ గురించి పట్టించుకోవడం మానేసి.. మీ విఫల పాకిస్తాన్‌ దేశం కోసం ఏదైనా మంచి చేయొచ్చు కదా.? కశ్మీర్‌ భారత్‌లో భాగంగా ఉన్నందుకు గర్వపడుతున్నా. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భూభాగమే’ అంటూ రైనా తన అధికారిక ట్విటర్‌లో ఆఫ్రిది వ్యాఖ్యలకు బదులిచ్చాడు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధించాయి. బాధ్యాతాయుతమైన భారతీయుడిగా, దేశం తరఫున ఆడిన ఆటగాడిగా అఫ్రిది వ్యాఖ్యలను ఏమాత్రం అంగీకరించను. మానవత్వంతో నువ్వు అడగ్గానే నా వంతు సాయం చేశా. కానీ మరోసారి చేయను'అని యూవీ ట్వీట్ చేశాడు. 

చదవండి:
కశ్మీర్‌కు నేనే కెప్టెన్‌గా ఉండాలి: అఫ్రిది
బంతిపై ఉమ్మి వాడొద్దు... 

మరిన్ని వార్తలు